నిమజ్జన సందడిలో బుల్లి సూపర్ స్టార్

Gautam Krishna in Vinayaka nimajjanam

05:03 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Gautam Krishna in Vinayaka nimajjanam

వినాయక చవితి కారణంగా ఎక్కడ చూసినా గణపతి నవరాత్రుల సందడే. అక్కడా ఇక్కడా అనికాదు దేశం అంతా గణపతి నామస్మరణతో మారుమోగిపోతోంది. విదేశాల్లో సైతం గణపతి నవరాత్రులు క్రేజ్ వుంది. చిన్నపిల్లలు, యువకులు ఉత్సాహంగా ఈ వేడుకలు జరిపిస్తున్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు అందరూ వినాయక పూజ, నిమజ్జనంలో నిమగ్నం అయ్యారు. ఈ సందడిలో మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ కూడా చేరాడు. 'జై బోలో గణేష్ మహరాజ్ కీ' అంటూ సందడి చేశాడు. ఇది రీల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ లోనే సుమా. దుబాయ్ లో తన పుట్టిన రోజు వేడుకలు పూర్తి చేసుకున్న గౌతమ్ ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చాడు.

వెంటనే వినాయక చవితి సందడిలో పాల్గొన్నాడు. తండ్రితో కలిసి ఇంట్లోనే బుజ్జి వినాయకుణ్ని ప్రతిష్టించుకుని పూజలు చేశాడు. మహేష్ కూడా ఈ పూజలో పాల్గొని అనంతరం షూటింగ్ కోసం చెన్నై వెళ్లిపోయాడు. ఇక తన ఇంట్లో ప్రతిష్టించుకున్న గణపతిని గౌతమ్ కృష్ణ నిమజ్జనం చేశాడు. తలకి కాషాయ రిబ్బన్ కట్టి స్నేహితులతో కలిసి దుర్గం చెరువు వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో టాప్ 10 అందగత్తెలు వీరే!

ఇది కూడా చదవండి: 'ఇంకొక్కడు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: ఫోన్ లాక్ కోడ్ చెప్పలేదని భార్యని ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

English summary

Gautam Krishna in Vinayaka nimajjanam