‘లైఫ్‌ ఎగైన్’ అంటున్న గౌతమి

Gautami Launches Life Again Foundation

12:03 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Gautami Launches Life Again Foundation

ఒకప్పుడు తన అంద చందాలతో , నటనతో ప్రేక్షకులను అలరించిన నటి గౌతమి ఇప్పుడు కేన్సర్‌ బాధితులను ఆదుకునేందుకు, ఆ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ‘లైఫ్‌ ఎగైన్’ పేరిట ‘వన్ ఫర్‌ వన్, వి ఆర్‌ దేర్‌ ఫర్‌ ఎవ్రీ వన్’ నినాదంతో ఓ ఆర్గనైజేషనను స్టార్ట్ చేసింది.దీనికి సంబంధించిన కర్టెనరైజర్‌ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించారు. సంస్థ సహవ్యవస్థాపకులు హైమారెడ్డి, మాల, నటులు సుధాకర్‌ కొమాకుల, మనోజ్‌ నందం, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ ‘‘నేను కేన్సర్‌ వ్యాధితో పోరాడి గెలిచా. ఈ వ్యాధితో ఏటా పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. వారిలో కొందరినైనా కాపాడేందుకు నేను చేస్తున్న చిన్న ప్రయత్నమిది. కేన్సర్‌ వ్యాధి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వ్యాధికి గురైతే ఏ విధమైన చికిత్స పొందాలి, అనే  దానిపై అవగాహన తీసుకురావాలన్నదే నాలక్ష్యం. కేన్సర్‌ వ్యాధితో పాటు ఇతర ప్రమాదకర వ్యాధుల గురించి కూడా అవగాహన కల్పిస్తాం’’ అని వివరించింది.

గౌతమి ప్రారంభించిన లైఫ్ అగైన్ ఫౌండేషన్ లాంచ్ ఫొటోస్....

1/6 Pages

గౌతమి

క్యాన్సర్ తో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు , క్యాన్సర్ వ్యాధి పై  ప్రజల్లో అవగాహన తీసుకువచ్చెందుకు ప్రముఖ నటి "గౌతమి లైఫ్ ఎగైన్" పేరుతో ఓ సోషల్ ఆర్గనెజైషన్ ను ప్రారంభించారు.

English summary

Veteran Actress Gautami Launched an Oraganisation Named "Life Again".The main theme of this organisation was to create awareness on Cancer.This function was organised in Prasad Preview Theater in Hyderabad. Co founder Hyma Reddy, Rahul, Manoj Nandam and few other were attended to this event.