గౌతమీపుత్ర ఆడియో డేట్ వచ్చేసింది(వీడియో)

Gautamiputra satakarni movie audio date confirmed

01:21 PM ON 29th November, 2016 By Mirchi Vilas

Gautamiputra satakarni movie audio date confirmed

నందమూరి నటసింహం బాలయ్య ప్రతిష్ఠాత్మకంగా నటిస్తున్న వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి గురించి అంచనాలు భారీగానే వున్నాయి. ఇక ఈ మూవీ ఆడియో రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అఖండ భారతావనిని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రను తాను పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు హీరో నందమూరి బాలకృష్ణ చెప్పాడు. అభిమానుల అంచనాలకు అనుగుణంగా చిత్రం రూపుదిద్దుకుంటోందని చెప్పాడు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, ట్రైలర్ ను డిసెంబర్ 16న తిరుపతిలో విడుదల చేయాలనుకుంటున్నట్లు బాలయ్య ప్రకటించారు.

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని శివసన్నిదానంలో మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణతోపాటు దర్శకుడు క్రిష్, చిత్ర యూనిట్, తదితరులు హాజరయ్యారు. కాగా ఈ చిత్రం విజయాన్ని కాంక్షిస్తూ అభిమానులు దేశవ్యాప్తంగా 1,116 దేవాలయాల్లో రుద్రాభిషేకాలు నిర్వహించారు.

English summary

Gautamiputra satakarni movie audio date confirmed