జార్జియాలో శాతకర్ణి క్లైమాక్స్

Gautamiputra Satakarni movie climax shooting in Georgia

10:40 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Gautamiputra Satakarni movie climax shooting in Georgia

ప్రతిష్టాత్మకంగా నందమూరి నటసింహం బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్ సీన్ చిత్రీకరణ కోసం యూనిట్ త్వరలో జార్జియా వెళ్ళబోతోందట. గ్రీకు సైనికులతో శాతకర్ణి యుద్ధం చేసే సన్నివేశాన్ని షూట్ చేయడానికి 300 గుర్రాలను, 20 రథాలను వినియోగిస్తామని దర్శకుడు క్రిష్ అంటున్నాడు. సుమారు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు సైన్యంగా కూడా ఈ షూట్ లో పాల్గొంటారని ఆయన చెప్పాడు. ఇంటర్వెల్ ముందు ఓ యుద్ధ సన్నివేశం వచ్చేలా మొదట మొరాకోలో కొన్ని సీన్స్ షూట్ చేయగా.. సెకండ్ షెడ్యూల్ లో హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలను తీశామని, ఇక మూడో యుద్ధ సీన్ కోసం జార్జియా వెళ్తున్నామని పేర్కొన్నాడు.

ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కి కొదవే ఉండదని అంటున్నారు. మొత్తానికి భారీ వ్యయంతో ఈ మూవీ రూపొందుతోంది. ఇక నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై. రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు

English summary

Gautamiputra Satakarni movie climax shooting in Georgia