శాతకర్ణి లీక్ అయ్యింది(వీడియో)

Gautamiputra Satakarni movie dailogues leaked

06:29 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Gautamiputra Satakarni movie dailogues leaked

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏమి చేసినా సినిమాల్లో డైలాగులు గానీ, పాటలు గానీ, చివరకు సినిమా కూడా లీక్ అవ్వడం మామూలైపోయింది. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీస్తున్న వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ డైలాగ్స్ లీకయ్యాయా? అనే టాక్ నడుస్తోంది. బాలకృష్ణ ఫ్యాన్స్ దీన్ని ద్రువీకరిస్తున్నారు. అందుకు సంబంధించి 48 సెకన్ల వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఆ వీడియో సినీ లవర్స్ ని విపరీతంగా ఎట్రాక్ట్ చేసుకుంటోంది. 30 సెకన్ల వరకు బాలయ్య ఆగకుండా డైలాగ్ చెప్పడం ఇందులోని విశేషం. రీసెంట్ గా యూఎస్ వెళ్లిన బాలయ్య, అక్కడ అభిమానులను ఉద్దేశించి ఒక డైలాగ్ చెప్పాడు. అది గౌతమీపుత్ర శాతకర్ణి మూవీలోదంటూ క్యాంపెయిన్ నడుస్తోంది.

మరికొందరైతే అదేంకాదని, గతంలో బాలయ్య ఎన్నో పౌరాణిక చిత్రాలు చేశాడని, వాటిలోని డైలాగ్స్ కావచ్చని అంటున్నారు. అభిమానులను అలరించడానికే ఇలా గుక్కతిప్పుకోకుండా చెప్పడంతో ఆయన ల్యాండ్ మార్క్ మూవీలోదంటూ కంక్లూజన్ కు వచ్చేశారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. మొరాకో షెడ్యూల్ లో ఓన్లీ క్లైమాక్స్ మాత్రమే షూట్ చేశారని, వార్ టైమ్లో ఇలాంటి డైలాగ్స్ వుండవనేది ఇంకొందరి ఒపీనియన్. ఏదైతేనేం సినిమా రిలీజైతేగానీ ఈ డైలాగ్ గౌతమీపుత్ర శాతకర్ణి ఫిల్మ్ లోదా కాదా అనేది తెలియాల్సివుంది. మొత్తానికి ఇదో రకమైన ఓ హంగామా నడుస్తోంది.

English summary

Gautamiputra Satakarni movie dailogues leaked