శాతకర్ణి రాయల్ లుక్ వచ్చేసింది..

Gautamiputra Satakarni movie first look

11:23 AM ON 10th October, 2016 By Mirchi Vilas

Gautamiputra Satakarni movie first look

నందమూరి నటసింహం ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ఇప్పటికే భారీ అంచనాలు తెచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల అయింది. తాజాగా నందమూరి అభిమానులకు దసరా పండుగ ఇంకా రెండు రోజులున్నా ముందే పండుగ తెచ్చేశాడు డైరెక్టర్ క్రిష్. శాతకర్ణి బాలయ్యబాబు మరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాడు. నీలి రంగు పంచె, చెంపల మీదకు తిప్పిన మీసం, విరబోసిన జుట్టు, సింహంపై చెయ్యి.. అన్ని కలగలపి ఓ దర్పం. రాజసంగా సింహాసనాన్ని అధిష్ఠించిన ధీరుడు గౌతమిపుత్ర శాతకర్ణి అతడు అన్నట్లుగా వుంది ఈ లుక్.

దీన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ఫేస్ బుక్ పేజీలో పెట్టాడు. శాతకర్ణిగా బాలయ్యబాబును క్రిష్ మంచి రాయల్ లుక్ లో బాగానే ప్రెజెంట్ చేశాడు ఈ జాతీయ అవార్డు గ్రహీత. దసరా పండుగ రోజు వరకు అభిమానులకు ఇక పండుగే. దసరా రోజు మరో శుభవార్తను చూపించబోతున్నాడు క్రిష్. మంగళవారం ఉదయం 10.15 గంటలకు శాతకర్ణి టీజర్ ను విడుదల చేయబోతున్నాడాయన. మరి, టీజర్ లో బాలయ్య ఎంతలా అలరిస్తాడో? సినిమాలో ఇంకెంత ధీరోదాత్తను చూపిస్తాడో వేచి చూడాల్సిందే.

English summary

Gautamiputra Satakarni movie first look