గౌతమీపుత్ర రిలీజ్ డేట్ కన్ఫర్మ్!

Gautamiputra Satakarni movie release date confirmed

04:55 PM ON 27th July, 2016 By Mirchi Vilas

Gautamiputra Satakarni movie release date confirmed

నందమూరి నటసింహం బాలయ్య వందో సినిమా విడుదలకు అప్పుడే ముహూర్తం నిర్ణయించేసారు. ప్రతిష్టాత్మక వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి శౌర్యపరాక్రమాలను, పోరాట పటిమను ఆవిష్కరిస్తూ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చారిత్రక చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు క్రిష్ ప్రకటించారు. అల్లు శిరీష్ నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన క్రిష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకి క్రిష్ పెళ్లి కారణంగా కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు.

పెళ్లి డేట్ దగ్గరపడ్డా, సినిమా చిత్రీకరణలో నిమగ్నమైన క్రిష్ కి స్వయంగా బాలయ్యే బ్రేక్ తీసుకోమని చెప్పాడట. ఏది ఏమైనా సంక్రాంతికి విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించిన చిత్రయూనిట్ అనుకున్నట్టుగానే జనవరి 12న విడుదల చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. మరో పది రోజుల్లో పెళ్లి చేసుకోనున్న క్రిష్ వివాహ పనుల్లో బిజీగా ఉన్నా, ఇప్పటి వరకూ చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్స్ దగ్గరుండి చేయిస్తున్నాడట.

English summary

Gautamiputra Satakarni movie release date confirmed