మధ్యప్రదేశ్ రాజదర్బార్ లో 'శాతకర్ణి'

Gautamiputra Satakarni movie shooting in Madhya Pradesh Raja Durbar

12:10 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Gautamiputra Satakarni movie shooting in Madhya Pradesh Raja Durbar

ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ సోమవారం నుంచి మధ్యప్రదేశ్ లో మూడో షెడ్యూల్ ప్రారంభించారు. చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలిపింది. 18 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనున్నట్లు పేర్కొంది. ఈ షెడ్యూల్ లో నందమూరి బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని తదితరులు పాల్గొంటున్నట్లు పోస్ట్ చేసింది. ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై వై. రాజీవ్ రెడ్డి, జాగర్లముడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఎక్కడా రాజీపడకుండా మూవీని తీర్చిదిద్దాలని యూనిట్ భావిస్తోంది. హేమామాలిని కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీకి సంబంధించి రాజదర్బార్ నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పిన ఘనత గౌతమిపుత్ర శాతకర్ణికే దక్కుతుంది. ఆయన చరిత్రని తెరకెక్కించడం ఆనందంగా ఉంది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ చిత్రం. బాలయ్య నటన, ఆయన పలికే సంభాషణలు కట్టిపడేస్తాయి. మొరాకోలో యుద్ధ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని చిత్రీకరించాం. ఇటీవల జార్జియాలో పతాక సన్నివేశాల్ని తెరకెక్కించామని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: బుర్రా సాయిమాధవ్, పాటలు: సీతారామశాస్త్రి.

ఇది కూడా చదవండి: నాన్నకు ప్రేమతో... ఇట్లు చైతూ-అఖిల్

ఇది కూడా చదవండి: శని వున్నవారు ఈ పత్రాలతో శివుడ్ని పూజిస్తే శని పోతుందట!

ఇది కూడా చదవండి: ఫేస్‌బుక్ పోస్ట్‌తో మగవెధవలకి భలే బుద్ధి చెప్పింది

English summary

Gautamiputra Satakarni movie shooting in Madhya Pradesh Raja Durbar.