లీకైన 'శాతకర్ణి' ఫోటోలు

Gautamiputra Satakarni movie shooting photos was leaked

04:51 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Gautamiputra Satakarni movie shooting photos was leaked

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటి హేమమాలిని బాలకృష్ణ తల్లిగా, హాట్ బ్యూటీ శ్రియ భార్య పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చేతిలో బిడ్డతో శ్రియ, గంభీరమైన వ్యక్తిత్వంతో హేమమాలిని, శాతకర్ణి పాత్రలో రాజసం ఉట్టిపడే విధంగా బాలకృష్ణ కనిపిస్తున్నారు. చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రాజీవ్ రెడ్డి, క్రిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంతాన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫోటోలు కింద స్లైడ్ షోలో చూడండి.

1/3 Pages

English summary

Gautamiputra Satakarni movie shooting photos was leaked.