'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ ఆపేసిన బాలయ్య

Gautamiputra Satakarni movie shooting was stopped

11:45 AM ON 22nd July, 2016 By Mirchi Vilas

Gautamiputra Satakarni movie shooting was stopped

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. బాలయ్య సరసన శ్రియ నటిస్తున్నవిషయం తెలిసిందే! అంతేకాదు అందాల తార హేమమాలిని కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం జార్జియా షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాల్ని చిత్రీకరించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అంతేకాదు షూటింగ్ ఆపించింది స్వయంగా బాలయ్యే... ఎందుకంటే... ఈ సినిమా దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆగస్టు 8న హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రమ్యను క్రిష్ పెళ్లాడబోతున్నాడు. పెళ్లి డేటు దగ్గరపడుతున్నా క్రిష్ ఇంకా సినిమా పనుల్లోనే బిజీగా ఉంటుండటంతో బాలయ్యే జోక్యం చేసుకొని జార్జియా షూటింగ్ లొకేషన్ నుండి క్రిష్ ను బయలుదేరమన్నాడు.

దీనితో రెండు రోజుల్లో క్రిష్ జార్జియా నుంచి హైదరాబాద్ కు రాబోతున్నాడు. క్రిష్ పెళ్లయ్యాక కొన్ని రోజులు తరువాత తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడు అని సమాచారం.

English summary

Gautamiputra Satakarni movie shooting was stopped