వంద థియేటర్లలో 'శాతకర్ణి' ట్రైలర్

Gautamiputra Satakarni movie trailer in 100 theatres

04:01 PM ON 28th October, 2016 By Mirchi Vilas

Gautamiputra Satakarni movie trailer in 100 theatres

టాలీవుడ్ లో సినిమా ప్రమోషన్ కోసం రకరకాల వ్యూహాలు.. ఎవరి పంధా వారిదే. ఇక నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తున్న వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి వంద సినిమా హాళ్లలో ట్రైలర్ వేస్తారట. క్రిష్ దర్శకుడుగా, శ్రియశరణ్ కథానాయికగా, హేమమాలిని కీలక పాత్రధారిగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: చిరంతన భట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సమర్పణ: బిబో శ్రీనివాస్. ఇక త్వరలో థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ తెలుగు జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు చక్రవర్తి శాతకర్ణి కథతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఫస్ట్ లుక్ కు, టీజర్ కు వచ్చిన స్పందన చూస్తుంటే సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వంద థియేటర్స్ లో ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. డిసెంబర్ మొదటివారంలో ఘనంగా ఈ వేడుకను నిర్వహించి జనవరి 12న సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు.

English summary

Gautamiputra Satakarni movie trailer in 100 theatres