మైండ్ బ్లాంక్ చేస్తున్న 'శాతకర్ణి' టీజర్(వీడియో)

Gautamiputra Satakarni teaser

12:40 PM ON 12th October, 2016 By Mirchi Vilas

Gautamiputra Satakarni teaser

నందమూరి బాలయ్య వందో చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో అందరి చూపు అటే వుంది. ఇక ఎప్పుడెప్పుడా అని నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' టీజర్ ని విజయదశమి సందర్భంగా రిలీజ్ అయ్యింది. 'విశ్రాంతి లేదు.. విరామం లేదు' అనే బాలయ్య డైలాగ్ తో ప్రారంభం అయ్యే ఈ టీజర్ లో వార్ సీన్లకు సంబంధించి కొన్ని క్లిప్స్ ని చూపించారు. ఇందులో బాలయ్య గెటప్, యాక్షన్ తో పాటు ఆయన మార్క్ డైలాగ్ అదిరింది. ఇక చిరంతన్ భట్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్.

క్రీ.శ.1వ శతాబ్ధానికి చెందిన శాతవాహనుల చక్రవర్తి శాతకర్ణి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. బాలయ్య కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందనడానికి ఈ టీజరే నిలువెత్తు నిదర్శనం. అసలు ఈ టీజర్ ఎలా ఉంటుందా..? అనే సందేహానికి ఔరా అనిపించేలా జవాబిచ్చాడు అంజనాపుత్ర క్రిష్. అంత అద్భుతంగా ఈ టీజర్ ని తన టెక్నికల్ టీంతో కలిసి రెడీ చేశాడు ఆ డైరెక్టర్.

English summary

Gautamiputra Satakarni teaser