కోహ్లి కంటే రహానె బెస్ట్‌ : సునీల్ గవాస్కర్‌

Gavaskar Praises Rahane

06:41 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Gavaskar Praises Rahane

భారత మాజీ ఆటగాడు, క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ యువ ఆటగాడు రహానె నే అత్యుత్తమ ఆటగాడని పోగడ్తలతో ముంచేత్తాడు. రహానె పూర్తి స్థాయి ఆటగాడని అన్నాడు.

దక్షిణాఫ్రికా తో జరిగిన ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోను రహానె సెంచురీలు చేసాడు. ఈ ఫీట్‌ సాధించిన ఐదో భారత ఆటగాడిగా రహానె రికార్డుల్లోకి ఎక్కాడు. రహానె పూర్తిస్థాయి భారత ఆటగాడని, దాదాపు అన్ని దేశాలతో పైన రహానె సెంచురీలు చేశాడని, ఈ విషయంలో టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కన్నా రహానె ముందున్నాడని అన్నాడు. రహానె ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండు, శ్రీలంక, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో కూడా పర్థితులకు తగ్గట్టుగా ఆడి సెంచురీలు చేసాడని గవాస్కర్‌ అన్నాడు.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 88 పరుగులు చేసి సెంచురీలు మార్కు చేరుకోలేక పోయినందుకు కాస్త బాధకు గురయ్యానని అన్నారు. కోహ్లి స్వదేశంలో సెంచురీ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ జడేజా ల బౌలింగ్ అద్భుతమని అన్నాడు . దక్షిణాఫ్రికా పై సిరీస్‌ను 3-0 తేడాతో గెలవడం అద్భుతమైన విషయమని. ఈ సీరీస్‌ విజయం ఇండియా క్రికెట్‌ టీంలో ఆత్మ విశ్వాశాన్ని పెంచుతుందని అన్నాడు.

English summary

Legendary Player Sunil Gavaskar Praises Anjinkya Rahane. He says that he is the most consistent batsmen than virat kohli. He also says that rahane is the batsman who plays consistently in all formats of the cricket