గేలకు ఎయిడ్స్‌ ముప్పు ఎక్కువ 

Gay Men in China Hit Hard By HIV/AIDS Epidemic

07:07 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Gay Men in China Hit Hard By HIV/AIDS Epidemic

గేలకు ఎయిడ్స్‌ వ్యాధి సోకే ముప్పు ఎక్కువుందని ఓ పరిశోధనలలో తెలిసింది. చైనాలో చేసిన ఒక అధ్యాయనం ప్రకారం ఎయిడ్స్‌ బాధితుల్లో గేలు ఎక్కువ ఉన్నారని చెప్పింది. చైనాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 1,10,000 ఎయిడ్స్‌ కేసులు నమోదు కాగా అందులో 25 శాతం మంది గేలు కావడం విశేషం.ఈ విషయాన్ని స్వయంగా చైనా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ అధికారి వు జున్యూ వెల్లడించారు.

ప్రతి ఐదుగురు గేలలో ఒకరికి ఎయిడ్స్‌ ఉన్నట్లు చైనా డెలీ పత్రిక తెలిపింది. బాధాకరమైన విషయం ఏమిటంటే విద్యార్దులు ఎక్కువగా ఎయిడ్స్‌ బారిన పడుతున్నారని. వారిలో 70 నుండి 80 శాతం మంది గేలతో సంభోగం జరపడం వల్లనే ఎయిడ్స్‌ వ్యాధి సోకిందన్నారు. విద్యార్ధులను ఎయిడ్స్‌ నుండి కాపాడడం కత్తిమీద సాములాగా మారిందని అన్నారు.

2003 లో తీసుకున్న చర్యల వల్ల చైనాలో ఎయిడ్స్‌ ప్రాబల్యం కేవలం 0.06 శాతం గా ఉందని,కానీ చైనాలో ఈ వ్యాధి వేగంగా గేలలో ఎక్కువైందని డిప్యూటీ డైరక్టర్‌ ఆఫ్‌ది చైనీస్‌ అసోసియేషన్‌ అధికారి షేన్‌జీ తెలిపారు.

ఎయిడ్స్‌ వైరస్‌ ను ఇతరులకు వ్యాపించకుండా ఉండడానికి యాంటీ-రిట్రోవైరల్‌ తగ్గించవచ్చని అన్నారు.

English summary

China has reported nearly 110,000 HIV/AIDS cases so far this year, with gay men accounting for over 25 per cent of the total, a media report said on Friday.