గేల్‌ను నిషేధించాలంటున్న మాజీ క్రికెటర్

Gayle Should Be Banned Says Ian Chappel

06:46 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Gayle Should Be Banned Says Ian Chappel

టీవీ జర్నలిస్టుతో అసభ్యంగా మాట్లాడిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్‌పై ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఒక ప్రతిపాదన చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. గేల్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని, దానిపై సహనంతో ఉండాల్సిన అవసరం లేదని చాపెల్ అన్నాడు. గేల్ గురించి తాను ఏ మహిళతో మాట్లాడినా ఒకేలాంటి సమాధానం వచ్చిందని, అందరూ అతడిపై నిషేధం విధించాలనే అడిగారని చెప్పాడు. ఆస్ట్రేలియాలోని ఏ క్లబ్బూ అతడితో ఇక కాంట్రాక్టు కుదుర్చుకోకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయిస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, అలాగే ఐసీసీకి ఈ మేరకు లేఖ రాసినా పర్వాలేదని తెలిపాడు. లేని పక్షంలో విడివిడిగా అన్ని దేశాలకు ఈ విషయం చెప్పాలని కోరాడు. గేల్‌కు ఇప్పటికే రూ. 6.66 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

English summary

Australian cricket legend Ian Chappell has called for a worldwide ban on Chris Gayle over his controversial TV interview with Channel 10 journalist Mel McLaughlin during a recent Big Bash League match.