ఒకమ్మాయితో గడపడానికి సిగ్గు లేదా అంటూ లెస్బియన్ జంటపై గీత సంచలన వ్యాఖ్యలు!

Geetha sensational comments on lesbian couple

11:12 AM ON 8th November, 2016 By Mirchi Vilas

Geetha sensational comments on lesbian couple

బుల్లితెర మీద వచ్చే పలు కార్యక్రమాలు వివాదం అవుతున్నాయి. మొదట్లో డ్యాన్స్ షోలు, కామెడీ షోల్లో కనిపించిన ఈ జాడ్యం ఇప్పుడు రియాల్టీ షోల పేరుతో తెలుగు ఛానెల్స్ ను చూసే సగటు ప్రేక్షకుడిని ఆందోళనకు గురిచేస్తోంది. సినిమాల్లో తారలుగా వెలుగొందిన జీవిత, రోజా, సుమలత, గీత... ఈ నలుగురు చేస్తున్న షోలకు తెలుగు జనం నీరాజనం పడుతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో వ్యవహరిస్తున్న తీరు చూసి అసహ్యించుకుంటున్నారు. మొన్నామధ్య ఓ టీవీ షోలో రోజా ఓ వ్యక్తిని కొడతానంటూ చెయ్యెత్తడం వివాదం అలుముకుంది. ఇక షోకు రాకపోతే కేసు పెడతామంటూ బెదిరించినట్లు జీవితపై ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు తాజాగా ఓ ఛానల్ లో ప్రసారమయ్యే ఇలాంటి ఓ షోలో నటి గీత వ్యవహరించిన తీరుపై కూడా వివాదం అవుతోంది.

1/5 Pages

తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ఓ లెస్బియన్ జంట టీవీ షోకొచ్చింది. ట్రాన్స్ మ్యాన్ ను గీత అడిగిన ప్రశ్నకు అవాక్కవడం ఆ షో చూసే వాళ్ల వంతైంది. ఒక యువతి నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు కూడా ఓ అమ్మాయివన్న విషయాన్ని మర్చిపోయావా అని గీత ఆ ట్రాన్స్ మ్యాన్ ని అడిగింది.

English summary

Geetha sensational comments on lesbian couple