అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న పటాకీ

George Pataki Quits From America President Race

07:18 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

George Pataki Quits From America President Race

అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకొంటున్నట్టు న్యూయార్క్‌కు చెందిన జార్జ్‌ పటాకీ ప్రకటించారు. జార్జ్‌ తన ఎన్నికల ప్రచారాన్ని కూడా నిలిపివేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని, అమెరికాకు అధ్యక్షుడిగా అంతా కలిసి సరైన వ్యక్తి ఎన్నుకుంటామన్న నమ్మకం ఉందని జార్జ్‌ ఓ వెబ్‌వీడియో ద్వారా వెల్లడించారు.

న్యూయార్క్‌ గవర్నర్‌గా పనిచేసిన జార్జ్‌ ఈ ఏడాది మేలో తాను రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా తాను ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నట్లు తెలిపారు. జార్జ్‌ వైదొలగడంతో ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్‌ పార్టీ తరఫున నామినేషన్‌కోసం 11 మంది పోటీ పడుతున్నారు. వీరిలో డొనాల్డ్‌ ట్రంప్‌ ముందంజలో ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి.

English summary

Former NY governor George Pataki quits from america president race