'జర్మనీ'లో కోట్లు కురిపించిన 'బాహుబలి'

Germany country bought Baahubali movie with crores

12:18 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Germany country bought Baahubali movie with crores

సెన్సేషనల్ డైరెక్టర్‌ యస్‌.యస్‌. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'బాహుబలి ద బిగినింగ్‌' భారీ వసూళ్ళు సాధించి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. ఈ సినిమా రోజురోజుకి మరిన్ని ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాకుండా చాలా అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఆర్కా మీడియా వర్క్స్‌ ఇంటర్‌నేషనల్‌ 'ఫ్రాంకోయిస్ డా సిల్వా' ప్రకారం రాజమౌళి ఈ సినిమాని 40 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా 90 మిలియన్‌ డాలర్లు సంపాదించి పెట్టింది. రాజమౌళి మహత్తరమైన చిత్రం బాహుబలి జర్మనీ లో భారీ మొత్తంలో అమ్ముడైంది.

అది మాత్రమే కాకుండా జపాన్‌, దక్షిణఆసియా, కెనడా, లాటిన్‌ అమెరికా సహా 70 ఇతర ప్రాంతాలలో ఈ సినిమా రైట్స్‌ అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఆర్కా మీడియా ఇంటర్‌నేషనల్‌ వారు కేరళ లో బాహుబలి -2 రైట్స్‌ను సొంతం చేసుకోవాలని చూస్తుంది.

English summary

Germany bought Baahubali movie with huge amount. Prabhas romanced with Anushka and Tamanna in this movie. S.S. Rajamouli was directed this film.