ఒక్క రాత్రి లో మొటిమలు మాయం !!

Get rid of pimples over night

04:49 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Get rid of pimples over night

రేపు పార్టీ ఉంది అందంగా రెడీ అవ్వాలి అనుకునే లోపే ముఖం మీద మొటిమలు కనపడితే ఎలా ఉంటుంది. ఆనందం కాస్త తుర్రుమంటుంది. ఇటీవల చాలా మంది కాలుష్యం వల్ల, వత్తిడికి గురికావడం వలన, అధిక వేడి వలన మొటిమల సమస్యకు గురవుతున్నారు. అందుకోసమే ఒక్కరోజులో మొటిమను ఎలా అనచాలో చూద్దాం మొటిమలను గిల్లడం, చేతితో తాకటం వంటి పనులు చేయకూడదు. అందువల్ల మచ్చలు పడిపోయి చర్మం అందహీనంగా తయారువుతుంది. తరుచూ ముఖన్ని నీటిలో శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి పోయి చర్మం ఆరోగ్యవంతం గా తయారవుతుంది.

మొటిమలు రావడానికి గల కారణాలు

ముఖం పరిశుభ్రంగా లేకపోయినా, అధిక వేడి, ఆయిల్‌ స్కిన్‌, వత్తిడి వలన ముఖం మీద మొటిమలు ఏర్పడతాయి. అంతేకాకుండా దిండు పరిశుభ్రంగా లేకపోయినా చుండ్రు సమస్యతో భాధపడుతున్నా మొటిమలు చోటు చేసుకుంటాయి. అందువల్ల ముఖాన్నే కాకుండా జుట్టు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దానివల్ల మొటిమలను కొంతవరకు ఆరికట్టవచ్చు.

మొటిమలను ఒక్క రోజులో తగ్గించుకోవడం సాధ్యమా..! అని అడిగితే సాధ్యమే అంటున్నారు కొంతమంది సౌందర్య నిపుణులు. అంటే ఒకే రోజు మచ్చతో సహా మటుమాయం అయిపోతుంది అని అనుకుంటే మీ పొరపాటే. ఈ చిట్కాల వల్ల మొటిమకు కారణమైన వాటిని తొలగించి మొటిమను అనిగిపోయేలా చేస్తుంది. అందువల్ల తరువాత రోజుకి మొటిమ అనిగిపోయి తగ్గిపోతుంది. కాని మీరు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే మొటిమలను పోరపాటున కూడా గిల్లకూడదు. దానివల్ల మచ్చపడిపోయి తగ్గించుకొనడానికి చాలా సమయం పడుతుంది. సులభం గా ఇంట్లో ఉంటూ డబ్బు ఖర్చులేకుండా మొటిమలు ఒక్క రాత్రిలో తగ్గించుకోవడం ఎలాగో ఇప్పడు చూద్ధాం.

ఒక్క రాత్రి లో మొటిమలు వదిలించుకోవటం ఎలా?

1. ఆవిరి పట్టడం

ఇది చాలా సులభమైన పద్ధతి ఇప్పడు మార్కెట్లో ఆవిరి పెట్టుకునే పరికరాలు చాలా లభిస్తున్నాయి. వీటిని వాడేటప్పడు చాలా జాగ్రత్త వహించాలి. అలా కాకుండా ఇంట్లో నహజ సిద్దంగా తయారు చేసుకొని ఆవిరి పట్టుకోవడం ఉత్తమం ఆవిరి పట్టడం వలన ముఖం మీద మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుని రంధ్రాలను శుభ్రం చేస్తాయి. ఆయిల్‌ మరియు మురికి పేరుకుపోవడం వలన ముఖం మీద రంధ్రాలు మూసుకుపోయి మొటిమలకు దారితీస్తాయి. అందువల్ల ఆవిరి పట్టడం వలన మురికిని శుభ్రంచేసి మొటిమలను రాకుండా సహాయపడుతుంది.

  • ఒక శుభ్రమైన పాత్రని తీసుకుని దానిలో సగం వరకు నీటిని పోయాలి. అలా కొంత సమయం ఆవిరిని మూత పెట్టి వేడి చేయాలి. తరువాత ఒక దళసరి టవల్‌ని తీసుకొని మీరు బరించగలిగే అంతవరకు ముఖనికి ఆవిరిని పట్టాలి. దాదావుగా 5 నుండి 10 నిమిషాలు పాటు ఉండవచ్చు. కాని మీరు బరించలేక పోతే 2 నిమషాలు ఆవిరి పట్టుకోండి చాలు.
  • దీని వల్ల ముఖం మీద మురికి వల్ల పేరుకు పోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి.

2. స్క్రబ్

ఇది పేరుకుపోయిన దుమ్ము ధూళిని, మృత కణాలను పోగొట్టడంలో ప్రముఖ పాత్రవహిస్తుంది. ఒక్క రాత్రిలో మొటిమలు పోవాలని ఆశపడేవారు తప్పకుండా కింద తెలిపే పద్ధతి తూచా తప్పకుండా అనుసరించాల్సిందే. ఎందుకేంటే స్కబ్‌ చేయడానికి నిమ్మకాయ ఉప్పు, ఆలివ్‌ ఆయిల్‌ ఉపయోగించడం వల్ల మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను చంపి మొటిమను ఎండిపోయేలా చేస్తాయి.

  • ఒక టేబుల్‌ స్పూన్‌ ఒక టీ స్పూన్‌ ఉప్పు, ఆలివ్‌ ఆయిల్‌ మరియు కొంచెం నిమ్మరసం తీసుకొని బాగా కలపాలి.
  • తరువాత వచ్చిన మిశ్రమంతో ముఖన్ని 2 నుండి 3 నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. అలా ఆ మిశ్రమాన్ని 20 నిమిషాలు పాటు వదిలి తరువాత ముఖన్ని శుభ్రంగా కడగాలి. దీని వల్ల ముఖం పై మృతకణాలు, బ్యాక్టీరియా, మురికి తొలిగిపోయి ముఖం కాంతివంతంగా తయారువుతుంది.

3. టీ ట్రీ ఆయిల్లేదా ఆస్పిరిన్

ప్రధానంగా ఆస్పిరిన్‌ మరియు టీట్రీ ఆయిల్‌ లో ఇన్‌ప్లమేటరీ గుణాలు ఉన్నాయి. వీటివలన మొటిమలు తక్కువగా కనపడడంలో సహాయపడి చివరికి తగ్గిపోయేలా చేస్తాయి. ఆస్పిరిన్‌ ని పొడిగా చేసుకొని దానిలో టీట్రీ ఆయిల్‌ని కలపాలి. టీట్రీ ఆయిల్‌ అందుబాటులో లేకపోతే మంచినీరు కలుపుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తరువాత పేస్ట్‌ మదిరిగా తయారవుతుంది. ఈ పేస్ట్‌ ని 20 నిమిషాల పాటు మొటిమలు మీద ఉంచాలి. తరువాత శుభ్రంగా ముఖన్ని కడగాలి.

4. ఐస్క్యూబ్

ఐస్‌క్యూబ్‌ వలన ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి మరియు నూనెను తొలగించటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తప్రసరణని మెరుగు పరుస్తుంది.

  • ఒక శుభ్రమైన వస్త్రాని తీసుకొని లేదా పాత టీషర్టుని తీసుకున్నా పర్వాలేదు.
  • ఆ టీ షర్టులో ఐస్‌ ముక్కలను వేసి చుట్టాలి. ఇప్పడు మొటిమలు వేధిస్తున్న ప్రాతంలో ఈ ఐస్‌ ముక్క కలిగిన వస్త్రాన్ని 10 నిమిషాలు పాటు ఉంచాలి.

5. బేకింగ్సోడా, టూత్పేస్ట్

లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌ అంటారు కదా! ఇది ఆకోవకు చెందిందే. బేకింగ్‌ సోడా మరియు టూత్‌ పేస్ట్‌ని కలిపి వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది. టూత్‌ పేస్ట్‌లో సిలికా అనే ఏజేంట్‌ ఉండటం వలన ఇది ఒక్క రాత్రిలో మొటిమలను తగ్గించగలదు.

  • కొంచెం టూత్‌పేస్ట్‌ని తీసుకొని అందులోని బేకింగ్‌ సోడా ని కలపాలి. ఒకవేళ టూత్‌ పేస్ట్‌కి బదులుగా వేరోకటి వాడాలి అనుకుంటే నిమ్మరసం వాడాలి. కాని టూత్‌ పేస్ట్‌ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల అదివాడానికే ప్రయత్నించండి.
  • ఈ రెండిటిని బాగా కలిపిన తరువాత అది చిక్కటి పేస్ట్‌లా మారుతుంది. ఇప్పడు దాన్ని మొటిమల మీద రాసుకొని రాత్రంతా వదిలేయాలి. మీరు ఉదయం లేచి చూసేసరికి మొటిమ మాయం అవడం చూసి ఆశ్చర్యపోతారు. ఇది అంతచక్కగా పనిచేస్తుంది.

చూసారు కదా ఇంట్లో ఉంటూనే మంచి ఫలితాన్ని ఇచ్చే 5 రకాల చిట్కాలు. వాడండి వాడి మంచి ఫలితాలను పొందండి.

English summary

Get rid of pimples over night. After many years of experience I finally figure out how to get rid of pimples overnight yes you heard right over night.