రేజర్ పొక్కులు వేగంగా నయం చేయటానికి మార్గాలు

Get Rid of Razor Bumps Fast

04:39 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Get Rid of Razor Bumps Fast

గడ్డం గీసుకున్నాక వచ్చే చిన్న చిన్న పొక్కులు చిరాకు,దురద,విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. అంతేకాక ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. గడ్డం గీసుకున్నాక చర్మం మీద తగినంత తేమ లేకపోవుట వలన పొక్కులు వస్తాయి. ఇవి గిరజాల జుట్టు ఉన్నవారిలో ఎక్కువగా కన్పిస్తాయి. చర్మం మీద మొటిమలు ఉన్న సమయంలో కూడా ఇన్ ఫెక్షన్ వచ్చి గడ్డలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వీటిని ఇంటి నివారణల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

1/11 Pages

1. వేడి నీటి కాపడం

కావలసినవి

  • నీరు - 200 ml
  • నీరు కాయటానికి ఒక పాత్ర
  • కాటన్ బాల్

పద్దతి

* ఒక పాత్రలో నీటిని తీసుకోని వేడి చేయాలి.
* నీరు వేడెక్కాక పొయ్యి మీద నుంచి దించి కొంచెం వేడి చల్లారనివ్వాలి.
* ఆ తర్వాత నీటిలో కాటన్ బాల్ ని ముంచాలి.
* ఆ కాటన్ బాల్ లో ఉన్న అదనపు నీటిని పిండి ప్రభావిత ప్రాంతంలో పెట్టాలి.
* ఈ విధంగా ప్రతి రోజు చేయాలి.

ఎలా పనిచేస్తుంది?

ఈ పరిస్థితిలో చర్మ రంద్రాలు మూసుకొని ఉంటాయి. వేడి నీటి కాపడం పెట్టటం వలన చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి. గాయాలు ఓపెన్ గా ఉంటే త్వరగా నయం అవుతాయి. ప్రభావిత ప్రాంతంలో వేడి నీటిని కాపడం పెట్టటం వలన బ్యాక్టీరియా లేకుండా శుభ్రం చేస్తుంది. అందువలన చర్మం మృదువుగా మారి నొప్పి తగ్గుతుంది.

English summary

Here are the top tips for Get Rid of Razor Bumps Fast. They generally happen after you shave and the strands of your hair start curling and growing into the skin itself, resulting in razor bumps.