ఇండిక్యాష్ ఏటీఎంలో 5 వేలు డ్రా చేస్తే... 50 వేలు వస్తున్నాయట!

Getting 50 thousand for 5 thousand in Indicash atm

09:50 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Getting 50 thousand for 5 thousand in Indicash atm

సాధారణంగా బ్యాంకు ఏటీఎంలో కార్డు పెట్టి, ఎంత డబ్బు అవసరమో వివరాలు నమోదు చేస్తే అంతే మొత్తంలో డబ్బులు రావడం సాధారణం. కానీ.. శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని టాటా ఇండిక్యాష్ ఏటీఎంలో మాత్రం రూ. 5 వేలు డ్రా చేద్దామనుకుంటే రూ. 50 వేలు, రూ. 4 వేలు బదులు రూ. 20 వేలు, రూ. 1000 డ్రా చేసిన వారికి రూ. 5 వేలు వచ్చాయి. కాగా.. రూ. వెయ్యి పైన డ్రా చేసిన వారికే ఇలా అధిక మొత్తంలో నగదు వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇలా డబ్బు డ్రా చేసినవారు పలువురికి చెప్పడంతో ఏటీఎం వద్ద అంతా క్యూ కట్టారు.

ఇలా ఐదారు మందికి పైగా నగదు డ్రా చేసిన తర్వాత ఏటీఎంలో డబ్బు అయిపోవడంతో పలువురు నిరాశగా వెనుతిరిగారు. ఈ విషయమై సీఐ విజయ్‌ కుమార్‌ను వివరణ కోరగా.. తమకెలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. మొత్తటం మీద నిన్న ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చిన వారు జాక్ పోట్ కొట్టినట్లే..

English summary

Getting 50 thousand for 5 thousand in Indicash atm. Getting 20 thousand for 4 thousand and 5 thousand for 1000 in Indicash Atm.