నెయ్యితో శిరోజాలకు రక్షణ... ఎలాగో తెలుసుకోండి..

Ghee is the best medicine for hair falling

11:41 AM ON 19th October, 2016 By Mirchi Vilas

Ghee is the best medicine for hair falling

అతివల సౌందర్యంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. శిరోజాల సౌందర్యం గురించి చెప్పాలంటే, రెండు దశాబ్ధాల కిత్రం నాటి కాలంలో స్త్రీలు ఒత్తైన కురులతో నిగనిగలాడే శిరోజాలతో చూపు తిప్పుకోనిచ్చేవారు కాదు. మరి నేడు అంతటి కేశ సౌందర్యం ఎంత మందికి ఉందంటే, ఇప్పుడు చెప్పలేం. కాలుష్యం పెరిగిపోయి, వేడి వాతావరణం కారణంగా నేడు ఆ సౌందర్యం మసకబారిపోతోంది. మగవారికే పరిమితం కాకుండా బట్టతల సమస్య ఆడవారినీ వేధిస్తోంది. తలస్నానం చేస్తే.. తల దువ్వుకుంటే గుప్పెడేసి కురులు ఊడి వచ్చేస్తుంటే ఎవరికి బాధ కలగదు.

పైగా యవ్వనవంతులనూ తెల్ల వెంట్రుకల సమస్య వేధిస్తోంది. సాధారణంగా శిరోజాల కోసం ఎన్నో రకాల నూనెలు మార్కెట్లో ఉన్నాయి. అయితే, నెయ్యి కూడా శిరోజాల ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

1/4 Pages

కండిషనింగ్ కు..


దేశీయ నెయ్యి శిరోజాలకు మంచి కండిషనర్ గా నిగనిగలాడేలా చేస్తుందట. రెండు చెంచాల నెయ్యిని ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తో కలిపి తల వెంట్రుకలకు రాసి 20 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

English summary

Ghee is the best medicine for hair falling