జీహెచ్ఎంసి ఎన్నికల్లో పదనిసలు  .....

GHMC Election Polling Process Continues Peacefully

11:09 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

GHMC Election Polling Process Continues Peacefully

జీహెచ్‌ఎంసీ పరిధిలోని హస్తినాపురంలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనలేదు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే పోలింగ్‌లో పాల్గొంటామని పేర్కొంటూ, ఓటర్లు బైఠాయించారు. ఇక ఉప్పల్‌ కల్యాణ్‌పురి ప్రాంతంలో వంద ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆందోళనకు దిగారు.

ఇక కూకట్‌పల్లి వివేకానందనగర్‌ కాలనీలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో 60 ఓట్లు గల్లంతవ్వడంతో స్థానికులు 32వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.

కాగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దంపతులు బంజారాహిల్స్‌రోడ్‌ నంబర్‌ 12లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. స్థానికంగా ఉన్న నీటిపారుదలశాఖ కార్యాలయంలో బంజారాహిల్స్‌ డివిజన్‌ పరిధిలోకి వచ్చే పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు తరలివస్తున్నారు. నగర ప్రజలు తెరాసకు పట్టంకట్టనున్నారని ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.

సైదాబాద్‌ ఎల్‌సీహెచ్‌ కాలనీ బూత్‌ వద్ద తెరాస, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఎల్‌వో విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. స్వల్ప ఘటనలు మినహా నగరంలోని అన్ని డివిజన్లలో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 6.74 శాతం పోలింగ్‌ నమోదైంది. 9గంటల నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. పోలింగ్‌ సరళిని వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

English summary

Greater Hyderabad Municipal Corporation(GHMC)Elections Continues Peacefully and in some places people were Protests on the officials because of deletion of their votes in the list