గ్రేటర్ ఖర్చు వెయ్యి కోట్లకు  చేరుతుందా!?

GHMC Elections Expenditure To Go Thousand Crores

11:06 AM ON 21st January, 2016 By Mirchi Vilas

GHMC Elections Expenditure To Go Thousand Crores

మినీ అసెంబ్లీ కాదు , కాదు , ఓ పెద్ద అసెంబ్లీ ఎన్నికలకు అయ్యేంత ఖర్చూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అవుతుందా అంటే , అవుననే సమాధానం వస్తోంది. అన్ని పార్టీల అభ్యర్ధుల ఖర్చు చూస్తే, ఏకంగా వెయ్యికోట్ల రూపాయల పైమాటే అంటున్నారు. అందుకేనేమో సాదా సీదా వ్యక్తులకే కాదు , ప్రజలతో సన్నిహిత సంభందాలున్న వాళ్ళను కూడా పక్కన పెట్టేసి, కేవలం గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా ఆశావహుల ఆర్ధిక స్థోమతతోనే టిక్కెట్లు కేటాయింపు ఉందనే వాదన వినవస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ విజయపతాకం ఎగురవేసి , అధికారం సొంతం చేసుకుంది. దీనికి తోడు వరంగల్ పార్లమెంట్ , ఎంఎల్సి ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోష్ మీదుంది. ఇక ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో కూడా తమదే విజయమనే ధీమాతో టిఆర్ఎస్ వుంది. ఎలాగైనా టిఆర్ఎస్ కి చుక్కలు చూపించాలని విపక్షాలు చూస్తున్నాయి. అందుకే గ్రేటర్ బరి అధికార - ప్రతిపక్ష పార్టీలన్నింటికీ అత్యంత ప్రతిష్టాత్మకం గా మారింది. సీనియర్లు వ్యక్తిత్వం ప్రజలతో సన్నిహితం లాంటి అంశాలను పక్కనపెట్టేశాయి. విజయంపై భరోసాతో ఉన్నప్పటికీ ఎందుకైనా మంచిదని గెలుపుకోసం అన్నిరకాల మార్గాలను ఆయా పార్టీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థి ఇతర సమీకరణాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో, డబ్బుకు కూడా అంతే విలువ ఇస్తున్నాయి. దీంతో పార్టీల ఖర్చు లెక్కలు చూస్తే కళ్లు తిరిగే స్థితి.

గ్రేటర్ ఎన్నికల్లో ఒక్కోపార్టీకి ఒక్కో అంశం కలిసి వస్తోందని చెప్పవచ్చు. తెలంగాణలో అధికారపక్షమైన టీఆర్ ఎస్ కు అధికార బలం ఎటూ ఉన్నది కాబట్టి అర్థబలం కూడా తోడయ్యాయి. అందుకనే ఎన్నికల్లో గెలవటానికి అవసరమైన నిధులు వ్యయం చేయగల స్ధోమత ఉన్న వారిలో అత్యధికులు అధికార పార్టీ తరపునే పోటీ చేయటానికే ఆసక్తి చూపుతున్నారు. అప్పోసప్పో చేసి ఇపుడు ఖర్చు పెట్టి గెలిస్తే చాలనే ఆలోచనతోనే పలువురు టీఆర్ ఎస్ ను ఆశ్రయించడంతో ఆపార్టీకి గిరాకీ పెరిగి, మిగిలిన పార్టీలకు ఇబ్బందిగా మారింది. అందుకే ఉన్నంతలో 'కాస్త డబ్బున్న' వాళ్ళనే మిగిలిన పార్టీలు కూడా ఎంపిక చేస్తున్నాయని అంటున్నారు.

అధికార టిఆర్ఎస్ విషయం అటుంచితే, ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్దితే కాస్త బెటర్. ఎందుకంటే మొన్నటి వరకూ ఏకదాటిగా పదేళ్లు అధికారంలో ఉండబట్టి కాంగ్రెస్ నేతలు ఖర్చుపెట్టుకునే స్ధితిలోనే ఉన్నార నే మాట వినిపిస్తోంది. అదే టీడీపీ-బిజెపి పరిస్దితి వేరేలా వుంది. తెలంగాణ టీడీపీ అయితే ఏకంగా గడచిన పదేళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉండటమే కాకుండా మరో ఐదేళ్ళపాటు ప్రతిపక్షంలోనే కొనసాగాల్పిరావటం ఇబ్బందిగా మారినా, ఏపీలో అధికారంలో ఉండటం కాస్త ఊరట. ఇక బిజెపి పూర్తిగా కేంద్రపార్టీపైనే ఆధార పడే సూచనలు వున్నాయని అంటున్నారు. బిజెపి అభ్యర్ధుల ఎన్నికల వ్యయం కూడా మిత్రపక్షమైన టీడీపీపైనే పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే మాటా అక్కడక్కడ వినవస్తోంది.

ఇక ఖర్చు విషయంలో ఈ డివిజన్ ఆ డివిజన్ అన్న తేడాలే లేవని విశ్లేషకుల అంచనా. ఈ లెక్కన ప్రతీ డివిజన్లోనూ ఒక్కో అభ్యర్ధికి సగటున ఏకంగా కోటి రూపాయల వరకూ వ్యయం అవుతుందని అంచనా. కానీ కొన్ని డివిజన్ లలో ఇది రెండు మూడింతలు వుంటుదట. దీంతో అన్నీ పార్టీలకు చెందిన అభ్యర్ధుల ఖర్చు సుమారు 800 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇది అంచనా కనుక చివరికి వెయ్యి కోట్లు దాటి నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నికల సంఘం నిర్దేశించే ఖర్చుకి , అభ్యర్ధులు పెట్టే ఖర్చుకి అల్లంత దూరం వుంటుంది. అద్గదీ సంగతీ.

English summary

`For the upcoming GHMC Elections Expenditure To Go Thousand Crores.Soo many parties and members to spend more money in Greater Hyderabad Municipal Corporation elections