ఫిబ్రవరి 2న  'గ్రేటర్' పోలింగ్ - 5న లెక్కింపు

GHMC elections on Feb 2nd

06:15 PM ON 8th January, 2016 By Mirchi Vilas

GHMC elections on Feb 2nd

రేపా , మాపా అని ఎదురు చూస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ముహూర్తం ఖరారైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఫిబ్రవరి 2న జీహెచ్‌ఎంసీలో 150 వార్డులకు పోలింగ్ జరుగుతుంది.

ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను పరిశీలిస్తే , జనవరి 12 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ వుంటుంది. జనవరి 18న నామినేషన్ల పరిశీలన చేస్తారు. జనవరి 21న నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుంది.

ఫిబ్రవరి 2న పోలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ ఏదైనా వార్డులో అనివార్య కారణాలతో పోలింగ్‌ ఆగితే ఫిబ్రవరి 4న వుంటుంది. ఇక ఫిబ్రవరి 5న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటిస్తారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను 15రోజులకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోపై హైకోర్టు గురువారం స్టే విధించి, రిజర్వేషన్లను వెంటనే ప్రకటించాలని కోర్టు ఆదేశించడంతో శనివారంలోగా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పినా , దీనికి ముందుగా శుక్రవారమే ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా, అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేసింది. శుక్రవారం చకచకా ఈ పరిణామాలు జరిగిపోయాయి.

వార్డుల రిజర్వేషన్లు .......

ఫిబ్రవరి 2న ఎన్నికలు జరుగంగున్న గ్రేటర్ హైదరాబాద్ లో వార్డుల రిజర్వేషన్ల వివరాలు ఇలా వున్నాయి. బిసి జనరల్ 25,- బిసి మహిళ 25,- ఎస్టీ జనరల్ 1,- ఎస్టీ మహిళ 1- , ఎస్సీ జనరల్ 5- , ఎస్సీ మహిళ 5-, జనరల్ మహిళ 44-, జనరల్ 44 కేటాయించారు. ఎస్సీ జనరల్ వార్డులు: 1, 4, 62, 133, 135 కేటాయించారు. ఎస్సీ మహిళ వార్డులు: 60, 90, 142, 144, 147 ..... బిసి జనరల్ వార్డులు: 3, 29, 39, 43, 48, 51, 52, 53, 54, 55, 56, 58, 64, 65, 69, 70, 71, 83, 88, 103, 112, 113, 125, 126, 127 కేటాయించారు. బిసి మహిళా వార్డులు: 9, 26, 34, 35, 37, 41, 42, 47, 49, 57, 61, 63, 67, 68, 72, 73, 74, 75, 76, 82, 86, 101, 128, 146, 148 కేటాయింపు అయింది.

పార్టీల్లో హడావిడి ....

గ్రేటర్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. ఎన్నికలు జరుగుతాయని తేలడంతో ముందునుంచే అందుకు తగ్గ ఏర్పాట్లలో వున్న ఆయా పార్టీలు ఇప్పుడు దూకుడు పెంచాయి. విమర్శలు , ప్రతి విమర్శలు ఊపందుకోనున్నాయి.

English summary

GHMC elections on Feb 2nd