గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌ సందడి

GHMC Elections Poling Starts Today

09:25 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

GHMC Elections Poling Starts Today

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పోరేషన్ ( జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లకు ఉదయం 7 గంటల కు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి కుందన్‌బాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కుందన్‌బాగ్‌లో పోలింగ్‌ ఏర్పాట్లను జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి తెలిపారు. 150 డివిజన్లకు 1,333 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, ఎన్నికల కోసం 7,802 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 72లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికల్లో అధికార టి ఆర్ ఎస్ , కాంగ్రెస్ , ఎం ఐ ఎం విడివిడిగా పోటీచేస్తుంటే, బిజెపి - టిడిపి ఉమ్మడిగా బరిలో వున్నాయి. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండిపోయింది. ఇక పోటీలో ఉంటుందని ఊహాగానాలు వచ్చినా జనసేన అసలు ఆ జాడే లేదు. పైగా ఆ పార్టీ అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా బిజెపి - టిడిపి తరపున ప్రచారానికి కూడా రాలేదు. తెలంగాణా సిఎమ్ కెసిఆర్ , ఎపి సిఎమ్ చంద్రబాబు , ఈ ఇద్దరు సిఎమ్ ల తనయులు కె టి ఆర్ , నారా లోకేష్ , కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ , బిజెపి నేత , కేంద్రమంత్రి ఎం వెంకయ్య నాయుడు తదితరులు ప్రచారం చేసిన సంగతి తెల్సిందే. ఈరోజు పోలింగ్ ముగిసాక , 5వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు.

English summary

Greater Hyderabad Municipal Corporation (GHMC) elections poling started today at morning 7:00 am.There were 150 divisions in GHMC.Soo many people were participating in GHMC elections and voting process continues peacefully