టీవీలోంచి దెయ్యం బయటికి వచ్చేసిందట మరి అప్పుడు ఏం ఏమైందో తెలుసా ?

Ghost Came Out from TV Screen

10:42 AM ON 30th January, 2017 By Mirchi Vilas

Ghost Came Out from TV Screen

సినిమాల్లో హార్రర్ మూవీలంటే భయం ఉండనిదెవరికి... ఎందుకంటే, వాటికి భయపడని వారు నూటికో, కోటికో ఒక్కరుంటారు. టీవీ లేదా సినిమా స్క్రీన్లపై హార్రర్ సినిమాలు, షోలు చూస్తుంటేనే భయం పుడుతుంది. మరి అలాంటి వాటిలో ఉండే దెయ్యాలు రియల్ క్యారెక్టర్స్ రూపంలో బయటికి వస్తే ఎలా ఉంటుంది..? అసలు తెరపై ప్రదర్శించే బొమ్మలు రియల్ లైఫ్లోకి ఎలా వస్తాయి..? అయితే హార్రర్ సినిమాలో ఉండే ఓ దెయ్యం క్యారెక్టర్ నిజంగానే బయటికి వచ్చిందట. మరి అదెలాగో ఓసారి చూద్దాం.

న్యూయార్క్లో అదొక టీవీ స్టోర్. టీవీలు అమ్మే షాపు. అందులో కొన్ని వందల సంఖ్యలో టీవీలున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు కస్టమర్లు వస్తున్నారు. అయితే అప్పుడే సడెన్గా ఓ టీవీలో నుంచి దెయ్యం పిల్ల బయటికి వచ్చింది. దీంతో టీవీలను కొనాలని అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా భయం చెంది, ఉలిక్కి పడి పరుగు లంకించుకున్నారు. కానీ, నిజానికి చెప్పాలంటే అది రియల్ దెయ్యం పిల్ల కాదు. ఆ టీవీ స్టోర్ వారు ఏర్పాటు చేసిందే.

కస్టమర్లు రావడానికి ముందే ఓ టీవీ వెనుక చిన్నపాటి గది ఏర్పాటు చేసి అందులో ఓ బాలికను అచ్చం ది రింగ్ ఇంగ్లిష్ సినిమాలోని దెయ్యం పిల్లలాగా ఉంచారట. ఇక చూసుకోండి, కస్టమర్లు రాగానే ఆ పిల్ల కాస్తా టీవీని తప్పించి బయటకు వచ్చేసింది. దీంతో కస్టమర్లు కంగుతిని ఒక్కసారిగా భయపడ్డారు. అదండీ అసలు సంగతి. ఒకవేళ నిజంగా వస్తే తట్టుకోగలరా?

English summary

Ghost character came out from TV channel in Newyork city it was shocking to all people. everyone was terrified by looking this real ghost from TV show.