కెమెరాకీ చిక్కిన దెయ్యం

Ghost Spotted in Australia

04:26 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Ghost Spotted in Australia

దెయ్యాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా.? ఈ చిత్రం చూస్తే కచ్చితంగా బాబోయ్‌ దెయ్యం అంటారు.

వివరాల్లోకి వెళ్ళితే పారానార్మల్‌ పరిశోధకులు కధనం ప్రకారం వారు ఒక దెయ్యాన్ని కెమెరాలో బందించినట్లు తెలియజేసారు. సిడ్నీకి చెందిన నలుగురు సౌత్‌ వెస్ట్‌ పారానార్మల్‌ ఇన్‌వెస్ట్‌ గేటర్‌ బృందం వారు ఈ చిత్రాన్ని సెయింట్‌ బర్తాలో మ్యూకి చెందిన శ్మశానంలో తీసినట్లు తెలియజేసారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.

1841 లో ఈ చర్చిని నిర్మించారు. ప్రమాదవశాత్తు 1989 లో ఒక అగ్నిప్రమాదం సంభవించింది అంతా నాశనం అయిపోయింది. 175 ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన ఈ చర్చి లో ఒక రోజు పెద్ద శబ్ధం వినపడడంతో సిడ్నీ నుండి వచ్చిన బృందం కెమెరాతో ఫోటోలని తీసి వాటిని డెవలెప్‌ చేసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఫోటోలలో దెయ్యం కనపడింది. వారు మొత్తం తీసిన 300 చిత్రాలను అభివృద్ది చేయగా ఆ ఫోటోల లోని 209 వ ఫోటో అసాధారణగా కనిపించింది . ఆ ఫోటో లో ఒక యువతి పరిగెత్తుతున్నట్లు కనిపించడంతో వారు షాక్‌ అయ్యారు. అక్కడ రోజూ ఏదో ఒక భయంకరమైన శబ్ధం వస్తూ ఉంటుందని ఆ బృందం వారు తెలియజేసారు.అక్కడ కనిపించిన యువతి 1963 లో చనిపోయిన ఎమిలీ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు.

English summary

Paranormal investigators claim to have captured incredible shots of a ghost in a graveyard - taken on Halloween night in Australia