జియోనీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్

Gionee Launched Marathon M5 Lite With 4000mAh Battery

04:46 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Gionee Launched Marathon M5 Lite With 4000mAh Battery

చైనాకు చెందిన మొబైల్ తయారీదారు జీయోనీ గత నెలలోనే మారథాన్ ఎం5 పేరిట కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. మారథాన్ ఎం5 ప్లస్ పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఇప్పుడే మారథాన్ ఎం5 లైట్ పేరుతో నూతన ఫోన్ ను చైనాలో రిలీజ్ చేసేసింది జియోనీ. కంపెనీకి చెందిన షాపింగ్ వెబ్ సైట్ లో ఈ ఫోన్ ను అమ్మకానికి పెట్టేసింది. దీని ధర సుమారు రూ. 10,000 వేలుగా నిర్ణయించింది. మారథాన్ సిరీస్ లో ఇతర ఫోన్ల మాదిరిగానే మారథాన్ ఎం5 లైట్ లోనూ బ్యాటరీ ఎక్కువ. ఇందులో 4000 ఎంఎహెచ్ లైపో బ్యాటరీ ఉంది. ఇది సుమారు 40 గంటల టాక్ టైమ్.. 68 గంటల పాటు మ్యూజిక్ ప్లే బ్యాక్, మూడు రోజుల సాధారణ వినియోగం.. 39 రోజుల స్టాండ్ బై టైమ్ ఇస్తుంది. ఈ ఫోన్ సాయంతో ఇతర ఫోన్లకు చార్జింగ్ చేసుకోవచ్చు. ఐదు అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లేతో ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వెర్షన్ తో పని చేస్తుంది. డ్యూయల్ సిమ్, 4జీ, 1.3 జిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, మాలీ టీ720 జీపీయూ, 16 జీబీ అంతర్గత మెమరీ(128 జీబీ వరకు పెంచుకోవచ్చు), 8 ఎంపీ వెనుక కెమెరా, 5 ఎంపీ ముందు కెమెరా మొదలైన ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ ఫోన్ ను భారత్ లో ఎప్పుడు విడుదల చేస్తుంది.. ఇక్కడ ధర ఎంత అన్న వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

English summary

Gionee mobile company last month launched its Marathon M5 smartphone and now it launch a upgraded version called Marathon M5 Plus