జియోనీ నుంచి మారథాన్‌ ఎం5 లైట్‌ 

Gionee Launched Marathon M5 Smart Phone

04:52 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Gionee Launched Marathon M5 Smart Phone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ జియోనీ మారథాన్‌ ఎం5 లైట్‌ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గురువారం నుంచి అన్ని మొబైల్‌ స్టోర్లలో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. దీని ధర రూ. 12,999గా జియోనీ ప్రకటించింది. 5 అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లే, 720*1280 పిక్సల్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్‌ ప్రొసెసర్‌, 1 జీబీ రామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, ఎస్డీకార్డుతో 128 జీబీ వరకు పెంచుకునే అవకాశం, 8 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 4జీ సపోర్టింగ్‌, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ బంగారు రంగులో మాత్రమే లభ్యమవుతోంది.

English summary

The Gionee Marathon M5 smart phone runs on Android 5.1 Lollipop, and is a dual-SIM dual standby smartphone with 4G LTE connectivity. It features a 5-inch HD (720x1280 pixel) IPS display with pixel density of 293 ppi, and is powered by a 64-bit 1.3GHz quad-core MediaTek MT6735 SoC, clubbed with 1GB RAM and Mali-T720 GPU.