బ్లూ ఫిల్మ్ లున్నాయనే నెపంతో విద్యార్థినికి నరకం చూపాడు(వీడియో)

Girl Attempts Suicide For Blackmailed By Man In Nellore

11:47 AM ON 6th July, 2016 By Mirchi Vilas

Girl Attempts Suicide For Blackmailed By Man In Nellore

ప్రేమ పేరుతో వంచించే ప్రయత్నం చేసి, అది కాస్తా కుదరకపోవడంతో నీలిచిత్రాలు ఉన్నాయంటూ బెదిరించి బలవంతంగా లొంగదీసుకొన్నాడు. పదేపదే పిలిపించి, లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేకపోయిన ఆ అభాగ్యురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఆమె పరిస్థితి బానే ఉంది. మంగళవారం నెల్లూరులో వెలుగు చూసిన ఈ ఘటన బాధితురాలి స్వస్థలం నెల్లూరు పట్టణంలోని మూలాపేట నీలగిరిసంఘంలో చోటుచేసుకుంది. మహిళా పాలిటెక్నిక్ లో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

అదే ప్రాంతానికి చెందిన ఉడతా సురేశ్ జిరాక్స్ దుకాణం నడుపుతున్నాడు. అతడికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. అయినా, బాధితురాలిని ప్రేమ పేరిట వేధించేవాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇరు కుటుంబాలు మాట్లాడుకొని రాజీ చేసుకొన్నాయి. కొంతకాలం బానే గడిచింది. ఒకనాడు సురేశ్ , ఫోన్ లో ‘‘నీకు సంబంధించిన నీలి చిత్రాలు కొన్ని నా దగ్గరున్నాయి. మా షాపు దగ్గరకొస్తే ఇస్తాను’’ అని బాధితురాలిని తీవ్రంగా బెదిరించడంతో బాధితురాలు అక్కడికెళ్లింది.

ఆ నీలిచిత్రాలు ఇవ్వవని బతిమాలింది. ఆమె నిస్సహాయతని సురేశ్ అవకాశంగా తీసుకొని, బలవంతంగా లొంగదీసుకొన్నాడు. అంతటితో వదిలిపెట్టలేదు. పదేపదే షాప్ కి రావాలని పిలిపించేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయినా వదలకుండా ఆమెపై సురేశ్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. దాంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్థాపానికి గురయింది. సోమవారం టెక్కేమిట్టలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. నిద్రమాత్రలు మింగి చనిపోవాలని ప్రయత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు, సురేశ్ పై ఫోక్సా యాక్ట్ ప్రయోగించారు.

ఇది కూడా చూడండి: బీరుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా!

ఇది కూడా చూడండి: భారత్‌ గురించి కొన్ని నిజాలు

ఇది కూడా చూడండి: పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్

English summary

Girl Attempts Suicide For Blackmailed By Man In Nellore.