శబరిమలైకి మగవేషంలో వచ్చిన యువతి

Girl cheat as a boy and entered in sabarimala temple

01:28 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Girl cheat as a boy and entered in sabarimala temple

శబరి మలై ఆలయానికి మహిళలు రాకూడదని , చిన్న పిల్లలుగా వున్నప్పుడు గానీ, వృద్ధాప్యంలో అడుగుపెట్టిన వాళ్ళు గానీ రావచ్చని నిబంధన ఉంది. అయితే ఎలాగైనా స్వామివారి దర్శనం చేసుకోవాలన్న పట్టుదలతో పోలీసుల కళ్లు గప్పి శబరిమలై అయ్యప్ప ఆలయానికి మగవేషంలో వెళ్లిన యువతిని భద్రతాధికారులు గుర్తించి వెనక్కి పంపారు. ఆ యువతి గురువారం రాత్రి 7 గంటలకు ప్యాంటు, షర్టు వేసుకొని బయలుదేరగా, పంబానది ప్రాంతంలో ఆమె నడిచి వెళ్తుండగా ఆలయ భద్రతాధికారులు అడ్డుకొని ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు గుండు గీయించుకొని మగవేషంతో వచ్చినట్లు ఆమె విచారణలో చెప్పింది. అమెను మదురైకి చెందిన లక్ష్మి(18)గా గుర్తించారు. శబరిమలై ఆలయలోకి మహిళలకు ప్రవేశం లేని విషయం తెలిసిందే. ఈ సంప్రదాయాన్ని మార్చాలని కోరు తూ కేరళ న్యాయవాదుల సంఘం న్యాయస్థానంలో వేసిన కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆలయానికి వెళ్లేందుకు ఇదే విధంగా ప్రయత్నిస్తున్న మహిళలను గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో చూడాలి.

ఇది కూడా చూడండి: ప్రపంచంలో భారత్ ని సగర్వంగా నిలబెట్టిన అరుదైన 12 అంశాలు

ఇది కూడా చూడండి: శరీరం నీరు పడితే ఎలా తొలగించుకోవాలంటే ...

ఇది కూడా చూడండి: దూమపానం చేసే వారికి సిరప్‌

English summary

Girl cheat as a boy and entered in sabarimalai temple.