ఇంటి పైభాగం నుంచి దూకి   విద్యార్ధిని ఆత్మహత్య

Girl Commits Sucide In Hyderabad

10:06 AM ON 5th January, 2016 By Mirchi Vilas

Girl Commits Sucide In Hyderabad

ఈ మధ్య కాలంలో విధ్యార్దునుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. చదువు వత్తిళ్ళు కారణమో, మానసిక వత్తిళ్ళు కారణమో , వేధింపుల కారణమో మరొకటో తెలియదు గానీ ఆత్మహత్యలు తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగులుస్తున్నాయి. తాజాగా హైదరాబాదు నగరంలో ఇలాంటి విషాద సంఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే, సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కమలానగర్‌లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి పై భాగం నుంచి కిందికి దూకడంతో తల పగిలి ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతురాలిని తుకారాంగేట్ సిఐ అర్జన్ కూతురు చంద్రికగా గుర్తించారు. బాలిక స్థానికంగా ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటన్నది తెలియాల్సి వుంది.

కాగా హైదరాబాదులోని కొత్తపేటలో గల ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో చుట్టుపక్కలవాళ్లు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపు చేసారు. ఈ ప్రమాదంలో రెండు సిలిండర్లు, ఐదు వాహనాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు.

English summary

An intermediate student in hyderabad commits sucide by jumping from the building. Police identified that Thukaram Circle Inspector daughter chandrika