ప్రధానమంత్రే నాకు బీటేశాడంటూ బాంబ్ పేల్చింది

Girl Exposes Pakistani Prime Minister Flirted With Me In Plane

11:39 AM ON 22nd July, 2016 By Mirchi Vilas

Girl Exposes Pakistani Prime Minister Flirted With Me In Plane

బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అన్నారు అందుకే ... లేకపోతే సాక్షాత్తూ ప్రధానమంత్రే ఈ భామకు లైన్ వేసాడట. పాకిస్తాన్ కు చెందిన అస్మా అనే ఓ యువతి ఈవిషయం చెప్పి పెద్ద బాంబు పేల్చింది. మరి వివరాల్లోకి వెళ్తే, కొన్నాళ్లక్రితం ఫ్లైట్ బిజినెస్ క్లాస్‌లో జర్నీ చేస్తుండగా తనకు నవాజ్ షరీఫ్ లైనేశాడని చెప్పింది. ఈ విషయాన్ని ఆస్మా పాక్ కు చెందిన హెచ్టీవీలో ప్రసారమయ్యే వఖార్ జకా రియాల్టీ షోలో వెల్లడించింది. 'ప్లైట్ లో నవాజ్ షరీఫ్ తనవైపే చూస్తూ మొదట నవ్వారు. ఆ తర్వాత ఏం చేస్తుంటావని అడిగారు. నేను కరాచీనుంచి ఇస్లామాబాద్‌కు వెళ్తునట్లు చెప్పగా నవాజ్ షరీఫ్ తానూ ఇస్లామాబాద్‌లోనే ఉంటానని మాటలు కలిపారు. అంతటితో వదలకుండా సాయంత్రం ప్రోగ్రామ్ ఏంటి అని అడిగారు. అయితే తాను ఇంకా ఏమీ ప్లాన్ చేసుకోలేదని అనడంతో డిన్నర్‌కు రమ్మని నవాజ్ షరీఫ్ ఆహ్వానించారు. అయితే తాను వెళ్లలేదు' అంటూ ఈ భామ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి తనదగ్గర అన్ని ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది. మరి అన్ని ఆధారాలు ఉంటే, బయట పెట్టొచ్చు కదా అని కొందరు అంటుంటే, అసలు ఇది నిజమని గ్యారంటీ ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఈ 3 వస్తువుల్లో మీరు ఏ టైపు.?

ఇది కూడా చూడండి: ఎడమ చేతి వాటం వెనుక అసలు రహస్యం

ఇది కూడా చూడండి: పంచముఖి ఆంజనేయుని గురించి ఆసక్తికర అంశాలు

English summary

Girl Exposes Pakistani Prime Minister Flirted With Me In Plane.