ప్రాణం తీసిన సెల్ఫీ

Girl Falls Into River While Taking Selfie In Dehradun

11:08 AM ON 17th January, 2017 By Mirchi Vilas

Girl Falls Into River While Taking Selfie In Dehradun

స్మార్ట్ ఫోన్ లు వచ్చాక సెల్ఫీలు పెరిగిపోయాయి. అక్కడా ఇక్కడా అని లేదు ఎక్కడ బడితే అక్కడ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సెల్ఫీ బాగోతం నడుస్తోంది. తాజాగా ఓ బాలిక నది ఒడ్డున నిలబడి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నదిలో పడి నీటిలో మునిగి మరణించింది. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. . పౌరీ పట్టణానికి చెందిన అష్నా భండారీ అనే బాలిక సెంట్రల్ స్కూలులో 12వ తరగతి చదువుతుంది. అష్నా తన 9 మంది స్నేహితురాళ్లతో కలిసి కోటేశ్వర్ దేవాలయంలో పూజలు చేసేందుకు వచ్చింది. పూజలు చేశాక అష్నాభండారీ దేవాలయం సమీపంలోని అల్కానంద నది ఒడ్డున నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా ఉన్నట్లుండి నదిలో పడి మునిగిపోయింది. ఆమె స్నేహితురాళ్లు అలారం మోగించడంతో మహంత్ శివానందజీ మహారాజ్ వచ్చేసరికి అష్నా మునిగిపోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. అష్నా మృతదేహం కోసం పోలీసులు నదిలో గాలిస్తున్నారు. సెల్ఫీ మోజు బాలిక ప్రాణం తీయడంతో విషాదం అలముకుంది.

ఇది కూడా చూడండి: ఆ సమయాల్లో తులసి ఆకులు తెంపితే ఏమౌతుందో తెలుసా

ఇది కూడా చూడండి: శంఖం ప్రత్యేకత ఏమిటో తెలుసా

ఇది కూడా చూడండి: పూజలో రాగిపాత్రలను వాడడం వెనుక అసలు రహస్యం ఇదే

English summary

Girl Falls Into River While Taking Selfie In Dehradun.