అందమైన అమ్మాయి కావాలా? అయితే 8 వేలకే సొంతం చేసుకోండి!

Girl for sale for only 8 thousand dollars

06:26 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Girl for sale for only 8 thousand dollars

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేస్తున్న దుర్మార్గాలకి అడ్డు, అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికే తమ వికృత చేష్టలతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ దుర్మార్గ ఉగ్రవాదులు.. తాజాగా మరో చర్యకు శ్రీకారం చుట్టారు. తమ చేతుల్లో బందీగా ఉన్న ఆడవాళ్ళను బానిసలుగా చేసి విక్రయిస్తున్నారు. ఇందుకోసం ఆ ఉగ్రవాదులు ఆ మహిళల శరీర కొలతలతో పాటు.. రంగు, ఆకారం వంటి వివరాలను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఓ అమ్మాయికి చెందిన కొన్ని ఫొటోలను ఓ ఐఎస్ తీవ్రవాది ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఆ అమ్మాయి అందచందాలు గురించి వివరిస్తూ.. ఇష్టమైన వాళ్ళు కొనుగోలు చేయవచ్చంటూ రేటు కూడా ఫిక్స్ చేశారు.

టెంట్లో కూర్చొని బురఖా ధరించిన అమ్మాయిని 8 వేల డాలర్లకు అమ్ముతానంటూ పోస్ట్ చేశాడు. ఆ తరువాత సన్నగా ఉన్న మరో అమ్మాయి ఫొటో పోస్ట్ చేసి.. రేటు 7 వేల డాలర్లు అని పేర్కొన్నాడు. ఇటీవల అమెరికా, ఐక్యరాజ్యసమితి దేశాలు ఐఎస్ పై విరుచుకుపడుతుండటంతో ఆ సంస్థ.. నిధుల కోసం అల్లాడుతున్నట్లు తెలుస్తున్నది. గత కొన్నేళ్లుగా తమ శత్రువర్గమైన యాజిదికి చెందిన మహిళలను ఎత్తుకువచ్చి.. సెక్సు బానిసలుగా వినియోగించుకొంటున్న ఉగ్రవాదులు.. నిధుల కోసం ఇప్పుడు వారిని విక్రయిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

English summary

Girl for sale for only 8 thousand dollars