ప్రేమ కోసం కిడ్నీ దానం..!

Girl Friend Donates Kidney To His Boy Friend

06:58 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Girl Friend Donates Kidney To His Boy Friend

నిజమైన ప్రేమ ఏం కోరుతుంది. తన సహచరులు బాగుండాలనే కదా. ఈమె కూడా అలాగే ఆలోచించింది. తన ప్రేమతో తన ప్రియునికి కొత్త జీవితాన్ని అందించింది. గత ఏడాది వేసవిలో బ్రిటన్ కు చెందిన జాక్ సిమర్డ్ (49), మిషెల్లి లాబ్రాంషె ఒక గోల్ఫ్ కోర్సులో తొలిసారి కలుసుకున్నారు. క్రమంగా ఒకరంటే ఒకరికీ అభిమానం ఏర్పడింది. ఇద్దరు ప్రేమలో పడిపోయారు. న్యూ హ్యాంప్ షైర్ లోని స్టోన్ బ్రిడ్జ్ కంట్రీ క్లబ్ లో ఇద్దరు కలసి తరచూ గోల్ఫ్ ఆడేవారు. అయితే, సిమర్డ్ రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో గత కొంతకాలంగా ఆయన కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలియడంతో మిషెల్లి రహస్యంగా వెళ్లి తన కిడ్నీ ఆయనకు సరిపోతుందో లేదో పరీక్షలు చేయించుకుంది. ఇద్దరి కిడ్నీలు మ్యాచ్ కావడంతో కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైంది. వీరి ప్రేమకు చిహ్నంగా వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14) నాడు మిషెల్లి సిమర్డ్ కు కిడ్నీ దానం చేయనుంది. సిమర్డ్ 19 ఏళ్ల కిందట తొలిసారి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. అప్పట్లో అతని సోదరి కిడ్నీ దానం చేసింది. ఇప్పుడు తన ప్రియురాలు ఇందుకోసం ముందుకొచ్చింది. తన భవిష్యత్ జీవితమంతా సిమర్డ్ యేనని, ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మిషెల్లి తెలిపింది.

English summary

A girlfriend donates her kidney to his boy friend. She is going to gift her kidney to his boy friend on the ocassion of valentines day