కిడ్నాపర్లను పట్టించిన కెమెరా 

Girl Kidnapped In Gurgoan Caught On Camera

01:44 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Girl Kidnapped In Gurgoan Caught On Camera

ఢిల్లీ సమీపంలోని ఒక కాలేజిలో విద్యార్ధిని కిడ్నాప్‌ చేస్తూ సీసీ కెమెరాలో చిక్కారు కిడ్నాపర్లు. ఈ ఘటన గుర్గావ్‌ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే సోమవారం ఉదయం 9 గంటలకు గుర్గావ్‌ లోని ద్రోణాచార్య కాలేజికి వచ్చిన ఒక విద్యార్ధినిని అందరూ చూస్తుండగానే కారులో వచ్చిన కిడ్నాపర్లు కిడ్నాప్‌ చేసారు. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించిన విషయం ఏమిటంటే ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది . దీంతో ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించి కేవలం కొన్ని గంటలలోనే బాధితురాలిని రక్షించి కిడ్నాపర్లను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

English summary

CC Camera helped to save a kidnapped girl in gurgoan. All this incident Caught on camera. With the reference of cc footage police trap those men.