ఆటోలో తీసుకెళ్ళిఅత్యాచారం చేసారు ...

Girl Raped By Two Men In Guntur District

05:38 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Girl Raped By Two Men In Guntur District

గుంటూరు జిల్లా లో ఓ దారుణం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన యువతి(21)పై అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి పిడుగురాళ్ళ సుందరయ్య కాలనీకి చెందిన యువతిని.. రహీం, రషీద్‌, వెంకటేశ్వర్లు, వెంకటేశ్‌ బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని రాజుపాలెం మండలం దేవరంపాడు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. రహీం, రషీద్‌లు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో రహీం, రషీద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. యువతిపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చూడండి

డబ్బులు లేక 5 రూ. మ్యాగీ తినేవాడట

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది(ఫోటోలు)

సంగీత్‌లో చిందేసిన మెగాస్టార్‌

English summary

A Girl with the age of 21 years was kidnapped by the two persons named Rahim and rashid were kidnapped and reped her in Piduguralla in Guntur District.Police filed case on this incident and arrested the two accused people and taken them into their custody.