ఫ్రీజర్ రూమ్ లో ఇర్రుకున్న యువతీ

Girl Strucks In Freezer Room

05:30 AM ON 1st January, 1970 By Mirchi Vilas

Girl Strucks In Freezer Room

మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో గడపడమంటే ఎంతటి వాళ్ళకైనా అసాధ్యమే...అలాంటిది ఒక యువతి రాత్రంతా రక్తాన్ని గడ్డకట్టించే చలి కలిగిన ఫ్రీజర్ లో గడపాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే దుబెనీ అనే 20 సంవత్సరాల యువతి స్థానిక సబ్ వేలో పనిచేస్తుంది. తన రోజువారీ పనిలో భాగంగా పాలను నిల్వ ఉంచడానికి ఫ్రీజర్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు రూమ్ యొక్క తలుపు దానంతట అదే మూసుకోవడంతో ఆమె ఆ గదిలో ఇరుక్కుపోయింది.ఎంత అరచినా ఎవరూ రావకపోవడంతో భద్రతా సిబ్బంది ఎవరైనా చూసి ఆమెను కాపాడతారనే ఉద్దేశ్యంతో ఆమె టమాటో కెచప్ తో ఒక కార్డు మీద "హెల్ప్ మీ" అని రాసి దానిని తలుపు కింద నుండి పంపింది. కాని దానిని ఎవరు గమనించక పోవడంతో ఆ యువతి ఫ్రీజర్లో చిక్కుకున్న సంగతి ఎవరు పట్టించుకోలేదు. ఎవరి మానాన వారు ఆ సబ్ వే సిబ్బంది ఇళ్ళకు వెళ్ళిపోయారు. దీనితో రాత్రంతా దుబెనీ రక్తం గడ్డ కట్టించే ఆ ఫ్రీజర్లోనే ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆపస్మారక స్థితిలో పడివున్న యువతిని గుర్తించిన సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు.

English summary

Subway Employee Daubeney, 20, of Gloucester, England strucks in Freezer Room while working.She writes "HELP ME" on cardboard with ketchup and slid it under the door.