ఇంజెక్షన్ రియాక్షన్..

Girl Suffering With burns after reaction to drug injection

11:00 AM ON 23rd June, 2016 By Mirchi Vilas

Girl Suffering With burns after reaction to drug injection

ఈ మధ్య అశ్రద్ధ, నిర్లక్ష్యం అన్నింటా కనిపిస్తున్నాయి. వైద్యంలో కనిపిస్తే, జరిగే ప్రమాదం అంతా ఇంతా కాదు. తాజాగా నల్గొండ జిల్లా లో ఇలాంటిదే చోటుచేసుకుంది. భువనగిరికి చెందిన 15 ఏళ్ళ అమ్మాయి మీనాక్షికి ఓ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించింది. అది రియాక్షన్ ఇవ్వడంతో ఆమె శరీరమంతా కాలిన గాయాలకు గురయినట్టు అల్లాడిపోతోంది. ఫిట్స్ తో బాధపడుతున్న మీనాక్షిని నల్గొండలోని కామినేని ఆసుపత్రిలో చేర్పించగా, అక్కడ ఓ డాక్టర్ ఇచ్చిన మందులు, ఇంజెక్షన్ ఆమె పాలిట శాపం అయింది. అయితే ఈ ఘటనపై ఆసుపత్రి డాక్టర్లు చేతులెత్తేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

మీనాక్షి తలిదండ్రులు తమ కూతురిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా... మీనాక్షికి సల్ఫర్ తో కూడిన మందులు ఇవ్వడంవల్ల ఇలా అయిందని, ప్రత్యామ్నాయ మందులతో చికిత్స చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా కావడం ఆమె ప్రాణానికే ప్రమాదమని చెబుతున్న వారి మాటలతో మీనాక్షి పేరెంట్స్ తల్లడిల్లిపోతున్నారు.

ఇవి కూడా చదవండి:ఆమె కడుపులో 'కత్తి' పండింది

ఇవి కూడా చదవండి:పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సక్సెస్ - ఇదో రికార్డు

English summary

A 15 Year old girl Menakshi was joined in a private hospital beacuse of she was suffering with Fits and the doctor given her injection and due to that injection the girl was suffering with burn injuries all over the body and now she was joined in government hospital and taking treatment.