లవర్ బైక్ కోసం సొంత ఇంటికే కన్నం వేసింది!

Girl turned as a thief for her lover

10:40 AM ON 21st June, 2016 By Mirchi Vilas

Girl turned as a thief for her lover

రాను రాను రోజులు ఎలా తయ్యారయ్యాయంటే, సొంత వాళ్ళని నమ్మలేని దుస్థితి వచ్చేసింది. ఎవరు ఏ సమయంలో ఎలా ఉంటారో కూడా చెప్పలేని స్థితి. అలాంటి బాపతే ఇది కూడా. లవర్ బాయ్ కి బైక్ కొనివ్వడానికి సొంత ఇంటికే ఓ ప్రియురాలు కన్నం వేసింది. ప్రియుడికి బైక్ కొనేందుకు తన సొంత పెద్దమ్మ ఇంటిలోనే చోరీకి పాల్పడిన నింధితురాలిని, ఆమెకు సహకరించిన ప్రియుడిని పెదపాడు, ఏలూరు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరుకు చెందిన యువతి, తంగెళ్లమూడికి చెందిన యువకుడు నగరంలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.

ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. తన ప్రియుడికి ప్రియురాలు మోటార్ బైక్ కొనిచ్చేందుకు తన ఆభరణాలు తాకట్టుపెట్టి డబ్బులు ఇచ్చింది. తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు ఆభరణాల గురించి ప్రశ్నించగా ఆమె ప్రియుడి పై ఒత్తిడి తేవడంతో అతడు వేరే వ్యక్తుల వద్ద అప్పు చేసి ఆమె ఆభరణాలు విడిపించి ఇచ్చాడు. అయితే ప్రియుడు చేసిన ఆ అప్పు తీర్చేందుకు ప్రియురాలు ఓ పథకం పన్నింది. ఇబ్బందులు తొలగాలంటే దొంగతనమే పరిష్కారమని ప్రియుడితో చెప్పింది. చివరకు పెదపాడులో ఒంటరిగా ఉంటున్న తన సొంత పెద్దమ్మ ఇంటికే కన్నం వేయాలన్న ప్లాన్ ను ప్రియుడికి చెప్పింది.

ఈనెల 12న పెదపాడు మండలం వసంతవాడలో ఒంటరిగా ఉంటున్న పెద్దమ్మ ఇంటికి వెళ్లి బ్యాంకు పనిమీద వచ్చానని చెప్పి ఆ రాత్రి అక్కడే పడుకుంది. అర్ధరాత్రి కాగానే ప్రియుడిని ఫోన్ చేసి పిలిచింది. అతను రాగానే పెద్దమ్మ గదిలోకి పంపి ఆమె శరీరం పై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకురావాలని సూచించింది. దీంతో అతను వృద్ధురాలి గదిలోకి చొరబడి కత్తితో బెధిరించి బంగారు నగలు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పక్క గదిలో ఉన్న ప్రియురాలు పెద్దమ్మా నగలు ఇచ్చేయ్ లేకపోతే దొంగ నిన్ను చంపేస్తాడని చెప్పింది. ఆమె ప్రియుడు ఆ వృద్ధురాలి ఒంటిమీద ఉన్ననగలు ఒలిచేసాడు.

తెల్లారాక చోరీ గురించి పోలీసులకు యువతే ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు యువతి తీరును సందేహించారు. చివరకు పోలీసుల దర్యాప్తులో ఆ యువతికి ప్రియుడు ఉన్నాడని తేలింది. వారిద్దరి పై కన్నేసిన పోలీసులు యువతి ప్రియుడి వద్ద నుంచి నూట పద్దెనిమిది గ్రాముల బరువైన 8 గాజులు, రెండు పేటల గొలుసు స్వాధీనం చేసుకున్నారు. కేసును కేవలం రెండు రోజుల్లోనే ఛేదించిన ఏలూరు రూరల్, పెదపాడు ఎస్ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అదండీ ఆధునిక లవర్స్ సంగతి.

English summary

Girl turned as a thief for her lover