ప్రియుడు ఇచ్చిన లిప్ కిస్ తో ప్రాణాలు కోల్పోయిన ప్రియురాలు!

Girlfriend died for her boyfriend lipkiss

05:41 PM ON 14th June, 2016 By Mirchi Vilas

Girlfriend died for her boyfriend lipkiss

అవును మీరు విన్నది నిజమే.. అదేంటి ముద్దు పెడితే ప్రాణాలు పోతాయా? అనే ఆశ్చర్యం మీకు కలగవచ్చు. కానీ ఇది నిజంగా నిజం.. అసలు ఆ ప్రియురాలి ప్రాణాలు ఎందుకు పోయాయో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. ఇంగ్లండ్ కు చెందిన మరియమ్ లిమే(20) కొన్నాళ్ల కిత్రం తన బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి ఓ హోటల్ కు వెళ్లింది. అక్కడ వారిద్దరూ చాలా సేపు హాయిగా కబుర్లు చెప్పుకున్నాక వారు తిరిగి వెళ్లిపోయేటప్పుడు లిమే భాయ్ ఫ్రెండ్ ఆమెకు ఘాటుగా లిప్ కిస్ ఇచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మరియమ్ కు అసలు నిద్ర పట్టలేదు. ఊపరి పీల్చడం కూడా కష్టమైపోయింది.

చాలాసేపు పోరాడి చివరకు తుదిశ్వాస విడిచింది. ఇంట్లో వాళ్లందరికి లిమే ఎలా చనిపోయిందో అర్థం కాక షాక్ అయ్యారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ లో మాత్రం లిమే బ్రెయిన్కు ఆక్సిజన్ అందక చనిపోయినట్టు తెలిపారు. దీనికి కారణం ఆమె బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ముద్దే అని తేలింది. అవును అక్కడకు వచ్చే ముందే ఆమె బాయ్ ఫ్రెండ్ పీనట్(వేరుశనగ) బటర్ స్కాచ్ శాండ్ విచ్ తిని వచ్చాడు. అయితే మరియమ్ చిన్నప్పట్నుంచి ఆస్తమాతో బాధపడుతుండడంతో ఆమెకు వేరుశనగ అంటే అలెర్జీ. కొద్దిగా తిన్నా.. ఆమె ప్రాణాలకే ప్రమాదం. అలాంటిది దాన్ని తిన్న బాయ్ ఫ్రెండ్ ఆమెకు గాఢంగా ముద్దివ్వడంతో ఆ అలెర్జీ కారణంగా మరియమ్ కన్ను మూసింది. ఈ విషయాన్ని ఇటీవల ఆమె తల్లి మీడియాకు తెలిపింది.

English summary

Girlfriend died for her boyfriend lipkiss