అమ్మాయిలే ఎక్కువగా వాటికి బానిసలవుతున్నారా?

Girls Addicts More To Smart Phones

12:15 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Girls Addicts More To Smart Phones

అవునా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ ఏమిటంటే,ఈ రోజుల్లో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్‌ దర్శనమిస్తోంది. ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఈ స్మార్ట్‌ఫోన్‌ లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా స్మార్ట్‌ఫోన్‌ లకు బానిసలవుతున్నవారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారట. ప్రతీరోజూ నాలుగు గంటల సమయం స్మార్ట్‌ఫోన్‌ లతో గడుపుతున్న అమ్మాయిల సంఖ్య 58 శాతం ఉండగా.. అబ్బాయిల శాతం 29.4 మాత్రమేనట. అలాగే 22.9 శాతం అమ్మాయిలు రోజులో ఆరు గంటలు స్మార్ట్‌ఫోన్‌ తో గడిపేస్తుంటే.. అబ్బాయిలో ఆ సంఖ్య 10.8 శాతమేనట. ఈ విషయాన్ని దక్షిణకొరియాలోని అజో యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. కాగా, అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ వాడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తే.. అమ్మాయిలు నలుగురిలోనూ ఉన్నప్పుడే స్మార్ట్‌ఫోన్‌ లను ఎక్కువగా వినియోగిస్తున్నారట. ఓ పక్క స్మార్ట్ ఫోన్లను అదే పనిగా వాడితే ప్రమాదమని చెబుతున్నా యువత ఇలా నిర్లక్షంగా వుండడం పట్ల పలువురు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి:17నెలల్లో 2234 మందికి హెచ్ఐవి

ఇవి కూడా చదవండి:చేతబడి గురించి మనకు తెలియని భయంకర నిజాలు..!

English summary

According To a Survey Made by South Korea University found that Girls were addicting more to smart phones when compared with Boys.