అక్కడ అమ్మాయిలు పరీక్షలయ్యాక ఇష్టమైన వాడితో లేచిపోతారట

Girls are going with his boyfriends after marriage

12:05 PM ON 6th April, 2016 By Mirchi Vilas

Girls are going with his boyfriends after marriage

సాధారణంగా పరీక్షలయ్యాక సమ్మర్ క్యాంప్ లకు వెళ్లడమో, సినిమాలకు, షికార్లకు పోవడమో, ఇంకా బుద్ధిమంతులైతే, ఫర్దర్ స్టడీస్ కి వెళ్లడమో సహజం... కానీ అక్కడ పరీక్షలయ్యాక ఇష్టమైనవాడితో లేచిపోతారట.. అదెక్కడంటే... తమిళనాడులో.... అక్కడ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో చివరి పరీక్ష వస్తుందంటే చాలు అక్కడి తల్లిదండ్రుల గుండెలు దడదడ కొట్టుకుంటాయి. దీనికి కారణం, ద్వితీయ సంవత్సరం చదివే అమ్మాయిల్లో కొందరు ప్రేమ పేరుతో అబ్బాయిలతో లేచిపోవడమే. గత ఏడాది ఇలా 125 మంది అమ్మాయిలు ద్వితీయ ఇంటర్ చివరి పరీక్ష పూర్తి కాగానే కనబడకుండా పోయారు.

ఇది కూడా చదవండి ప్రపంచాన్ని వణికించిన సంఘటనలు

దీంతో వారివారి తల్లిదండ్రులు తమ కుమార్తె కనబడటం లేదని కేసులు పెట్టారు. అయితే చివరికి తేలిందేమిటంటే... వారంతా తమతమ ప్రేమికులతో లేచిపోయి పెళ్లి చేసేసుకున్నారట. ఈ ఏడాది అంతే... హిస్టరీ రిపీట్. ఈసారి 100 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు. అమ్మాయిల తల్లిదండ్రులు యధావిధిగా తమ కుమార్తెలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం, దర్యాప్తు చేసి అమ్మాయిల ఆచూకి కనుగొంటే వారంతా ప్రేమించి వాడితో పెళ్లి చేసేసుకుని కనబడడం. దీంతో పోలీసులు షాక్ అవ్వడం షరా మామూలే. దీంతో మిగిలినవారు కూడా ఇలాగే సెటిల్ అయి ఉంటారన్న వాదన వినబడుతోంది. ఈ యవ్వారం చూస్తుంటే, అందరూ అదే బాట పడితే ఇక అంతే సంగతులు..

ఇది కూడా చదవండి దేవుని గదిలో ఎన్ని విగ్రహాలను ఉంచి పూజ చేయాలి

ఇది కూడా చదవండి సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

English summary

Girls are going with his boyfriends after marriage. Inter college girls are going with boy friends and marrying after exams.