టీచర్ ని చితకబాది బుద్ధి చెప్పిన అమ్మాయిలు(వీడియో)

Girls beaten teacher on road for eve teasing

05:18 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Girls beaten teacher on road for eve teasing

ఒకప్పుడు గురువంటే విద్యార్థులకు ఎంతో గౌరవం ఉండేది. గురువు కూడా విద్యార్థులు పట్ల సఖ్యత చూపించే వాడు. కానీ ఇప్పుడు గురువు అనే పదానికి అర్ధమే మారిపోయింది. పాఠాలు నేర్పాల్సిన గురువే విద్యార్థులపై విరుచుకు పడుతున్నాడు. తాజాగా అమ్మాయిల్ని టీజ్ చేసిన ఓ మాష్టారు గారికి బడిత పూజ చేశారు. అమ్మాయిలు వెదురుకర్రలతో అతన్ని చితకబాది, మోకాలిపై నుంచోపెట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని ఉత్కల్ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థినిపై వినోద్ కుమార్ సాహూ అనే ఓ ప్రైవేట్ ట్యూటర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు.

వాణి విహార్ వద్ద ఉన్న వర్శిటీ క్యాంపస్ వుమెన్స్ హాస్టల్ కు ఆమె వెళ్తుండగా బస్ స్టాప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆ విద్యార్థిని స్నేహితులను పిలవగా వెంటనే అక్కడకు వచ్చారు. ఆమె స్నేహితులకు విషయం చెప్పింది. ఇది గమనించిన సాహు అక్కడ నుంచి జారుకున్నాడు. అయితే అమ్మాయిలు అతని కోసం గాలించి వీఎస్ఎస్ నగర్ గేట్ వద్ద పట్టుకున్నారు. రోడ్డుపై అతణ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

ఇది కూడా చదవండి: ఎంతటి విషపు పాము కరిచినా ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు!

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ఫాన్స్ కి బాడ్ న్యూస్: ఏపీలో 'జనతా' బెనిఫిట్ షోలు లేనట్టే!

ఇది కూడా చదవండి: ఆడవారికి పూనకం రావడానికి కారణాలు ఇవే!

English summary

Girls beaten teacher on road for eve teasing. In Orissa girls students beaten private teacher for eve teasing on road.