ప్రియుడు కోసం బాత్రూమ్ లో గొడవ పడ్డ అమ్మాయిలు.. ఏమైందో చూడండి

Girls fight with each other for boyfriend

06:16 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Girls fight with each other for boyfriend

ఉన్నత పాఠశాలలో విద్యార్థునుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ పదహారేళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన విల్మింగ్టన్‌లో ఓ హైస్కూలులో గురువారం నాడు చోటు చేసుకుంది. ఓ అబ్బాయి విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘర్షణ చెలరేగడానికి కారణమని మిగతా విద్యార్థినులు చెప్పారు. మృతి చెందిన బాలిక బాత్ రూంకు వెళ్లింది. ఆ సమయంలో కొట్లాట జరిగిందని మరో విద్యార్థిని చెప్పింది. మృతి చెందిన బాలిక, మరో బాలిక కలిసి తొలుత కొట్లాడారు. తర్వాత అక్కడే ఉన్న మిగతా విద్యార్థినులు అందరూ కలిసి బాధిత బాలిక పైన పిడిగుద్దులు గుద్దారు. ఆమె పై ఎగిరి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు.

విద్యార్థినులు ఎలాంటి మారణాయుధాలు వినియోగించలేదని పాఠశాల యాజమాన్యం తెలిపింది. గాయపడ్డ బాలికను హెలికాప్టర్లో ఆసుపత్రిలో చేర్పించారు. కాని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

English summary

Girls fight with each other for boyfriend