అమ్మాయిలను బజారులో అమ్మేస్తున్నారు.. ఎందుకో తెలుసా?

Girls for sale in China bazaar

10:43 AM ON 20th April, 2016 By Mirchi Vilas

Girls for sale in China bazaar

కూరగాయల మార్కెట్లో కాయగూరలు అమ్మినట్లు, పశువుల సంతలో ఆవులనో, గేదెలనో అమ్మినట్లు, బజారులో వస్తువులు అమ్మినట్లు అమ్మాయిలను అమ్ముతున్నారు. ఎక్కడో తెలుసా? అయితే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే. చైనా బజార్లలో అమ్మాయిలని వస్తువులను అమ్మినట్లు అమ్ముతున్నారు. పైగా వారిని కొనుక్కోవడానికి అబ్బాయిలు విపరీతంగా ఎగబడుతున్నారు. అయితే వారు ఆ అమ్మాయిలను కొనుక్కుంటుంది బానిసలను చేసుకోవడానికో లేక శృంగార కోరికలు తీర్చుకోవడానికో కాదు.. సాంప్రదాయంగా పెళ్లి చేసుకోవడానికి. అవును..

మీరు వింటుంది నిజమే స్వదేశంలో అమ్మాయిల కరువవ్వడంతో చైనా అబ్బాయిలు వియత్నాం అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇలా బజార్ల వెంట తిరుగుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా చైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే తప్పంతా ప్రభుత్వానిదే కాబట్టి. ఎందుకంటే చైనాలో ప్రజల సంఖ్య ఎక్కువ కాబట్టి కొన్ని రోజుల కిందటి వరకు చైనాలో ఒకే సంతానం విధానం కఠినంగా అమలు జరిపేవారు. అలాగే చైనా దంపతులు తమ ఏకైక సంతానంగా మగబిడ్డనే కోరుకునే వారు. ఆడపిల్లని తెలిస్తే వెంటనే నిర్దాక్షణ్యంగా అబార్షన్ చేయించుకునే వారు.

రెండోసారి ఆడపిల్లను కనడానికి అవకాశం లేదు. దీంతో చైనాలో అబ్బాయిలు, అమ్మాయిలు సంఖ్య అధికంగా తగ్గిపోయారు. ఇప్పుడు ఉన్న చైనా అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే అంత చిన్న విషయం కాదు. సంఖ్య పరంగా అమ్మాయిలు తక్కువగా ఉండడం వల్ల వారికి విపరీతంగా డిమాండ్‌ పెరిగిపోయింది. చైనా అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకునేవారు అధిక మొత్తంలో ఎదురు కట్నం ఇచ్చి, పైగా పెళ్లి ఖర్చులు కూడా అబ్బాయే భరించాలి. అలాగే పెళ్లి కుమారుడికి పెద్ద ఉద్యోగం, సొంత ఇల్లు వుండాలి. అందుకే ఇవేవీ లేని వారు వియత్నాం నుంచి అక్రమ రవాణా అయిన అమ్మాయిలను రూ. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టి కొనుక్కుంటున్నారు.

చైనాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వియత్నాం అమ్మాయిలకు వల వేస్తున్నారు స్మగ్లర్లు. ఇక్కడ మార్కెట్లో ఆ అమ్మాయిలను లక్షలకు అమ్మేసి వారికి రూపాయి కూడా ఇవ్వకుండా డబ్బు మొత్తం స్మగ్లర్లే నొక్కేస్తున్నారు. అలా అమ్మకం అయిపోయిన అమ్మాయిలు, కన్న తల్లిదండ్రులను, పుట్టిన దేశాన్ని వదిలి ఎవరో ముక్కూ, మొహం తెలియని వాడితో కాపురం చేయాలి. అక్కడి వియత్నాంలోని అమ్మాయిల తల్లిదండ్రులకు కూడా అసలు విషయం తెలియదు. ఇలా ఎంతోమంది వియత్నాం యువతులు చైనాలో అమ్ముడుపోతున్నారు.

English summary

Girls for sale in China bazaar. Smugglers are bringing teenage girls from Vietnam and selling in China bazaar to teenage boys. They are selling girls for 2 to 5 lakhs.