ఆడవాళ్ళకు ఎక్కువగా వచ్చే కల ఏమిటో తెలుసా?

Girls get this type of Dreams more

11:10 AM ON 3rd September, 2016 By Mirchi Vilas

Girls get this type of Dreams more

మగాళ్లతో పోలిస్తే మహిళలకు ఎక్కువగా కలలు వస్తుంటాయట. వారికి ఎక్కువ కలలు రావడమే కాదు. వచ్చిన కలలు కూడా మానసికంగా తీవ్ర ప్రభావం కలిగించేలా చెడు కలలై ఉంటాయట. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతారట. భాగస్వామి తమను మోసం చేసినట్లు ఆడవాళ్లు ఎక్కువగా కలగంటారట. ఇదేదో మనం చెబుతున్న విషయం కాదండి బాబూ... అమెరికాకు చెందిన అమెరిస్లీప్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వారు రెండు వేల మందిపై అధ్యయనం చేసి మరీ కొన్ని విషయాలను వెల్లడించారు. అవేంటంటే..

1/3 Pages

భర్త తమను మోసం చేశాడని కలగనడంతోపాటు నోట్లోని దంతాలు ఊడిపోయినట్లు, ఎవరో తమను వెంటాడుతున్నట్లు, సాలెపురుగులను చూస్తున్నట్లు ఆడవాళ్లకు కలలు వస్తాయట. ప్రిపేర్ కాకుండానే పరీక్ష రాస్తున్నట్టు కూడా వారు కలగంటారట. సగం మందికిపైగా ఆడవాళ్లకు ఎవరో తరుముతున్నట్లు కలలు వస్తాయని తేలింది. ఆందోళన వల్ల కలలు వస్తాయని తేలింది. మహిళల్లో ఆందోళన ఎక్కువగా ఉండటంతో ఇలాంటి కలలు వస్తాయట.

English summary

Girls get this type of Dreams more