అబ్బాయిల్లో అది ఉంటే అమ్మాయిలు పడి చస్తారట!

Girls likes this kind of boys very much

06:47 PM ON 20th July, 2016 By Mirchi Vilas

Girls likes this kind of boys very much

అవును అబ్బాయిల్లో అది ఉంటే అమ్మాయిలు వాళ్లంటే పడి చస్తారట.. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. అబ్బాయిల్లో అమ్మాయిలకి కావాల్సింది 'సెన్స్ ఆఫ్ హ్యూమర్' అట. అంటే హాస్య చతురత, వ్యంగ్యంగా మాట్లాడగలగటం. నిశ్శబ్ధంగా ఉన్నచోట నవ్వులు పూయించే నేర్పరితనం. ఆ హాస్యచతురతే మీ దగ్గర ఉంటే, నచ్చిన అమ్మాయిని పడేయటం అనుకున్నంత కష్టమైన పనేం కాదు. అమ్మాయిలపై జరిగిన ఓ ఆన్ లైన్ సర్వేలో డ్రీమ్ బాయ్ క్వాలిటిస్ లో హాస్యచతురత మొదటిస్థానాన్ని దక్కించుకుంది. నవ్వుతూ, నవ్వించే మగవారు పక్కనుంటే, సమయం ఇట్టే గడచిపోతుందని,

రాత్రంతా మాట్లాడినా, నిద్ర, అలసట అనేవి దగ్గరకి కూడా రావని, అలాంటి మగవాడు మొగుడిగా వస్తే, అమ్మాయి అదృష్టవంతురాలని అభిప్రాయపడ్డారు సుందరీమణులు. అమ్మాయిలకు మాటలన్నా, మాట్లాడటమన్నా ఇష్టం. ఇష్టమైన వాడితో గంటలకొద్దీ కబుర్లు పెట్టాలని ఏ అమ్మాయికి ఉండదు. అలాంటప్పుడు అబ్బాయిలో హాస్యచతురత ఉండాలి. మాటలని.. నవ్వించే విధంగా మలిచే నేర్పు ఉండాలి. లేదంటే కొన్నిరోజులకి బోర్ కొట్టేస్తారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయి మాటలని నిద్రలోంచి అప్పుడే లేచిన అమ్మాయి కూడా ఆసక్తిగా వింటుంది. కాబట్టి అమ్మాయిల దగ్గర సీరియస్, టెన్షన్, కోపం వదిలేసి చక్కగా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడండి.

English summary

Girls likes this kind of boys very much